Begin typing your search above and press return to search.

ఇక్క‌డి వ‌ర‌కు ఎలా వ‌చ్చానా అని అనిపిస్తుంది : స‌మంత‌

By:  Tupaki Desk   |   8 Nov 2022 5:36 AM GMT
ఇక్క‌డి వ‌ర‌కు ఎలా వ‌చ్చానా అని అనిపిస్తుంది : స‌మంత‌
X
క‌ష్ట‌కాలంలో ఎన్నో స‌వాళ్లు ఎదుర‌వుతుంటాయి. అయితే వాట‌న్నింటినీ ఎదుర్కొంటూ మ‌నోధైర్యంతో కొంత మంది ముందుకు సాగుతుంటారు. స‌మంత కూడా అంతే. స‌వాళ్ల‌కు వెర‌వ‌ని వ్య‌క్తిత్వం స‌మంత సొంతం. వెండితెర‌పై ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధీటుగా నిల‌బ‌డి స‌వాళ్ల‌ని ఎదుర్కొని నిల‌బ‌డింది. రియ‌ల్ లైఫ్ లోనూ ఎన్నో స‌వాళ్ల‌ని ఎదుర్కొంటున్న స‌మంత ఇటీవ‌ల తాను మ‌యెసైటీస్ వ్యాధితో పోరాడుతున్నాన‌ని వెల్ల‌డించి అంద‌రిని షాక్ కు గురిచేసింది.

ప్రాణాంత‌క‌మైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న స‌మంత ప్ర‌స్తుతం న‌వంబ‌ర్ 11న రిలీజ్ కు రెడీ అవుతున్న 'య‌శోద‌' సినిమా కోసం ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటోంది. ఈ మూవీ ద్వారా హ‌రి - హ‌రీష్ ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీ‌దేవి మూవీస్ బ్యాన‌ర్ పై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించారు. స‌రోగ‌సీ మాఫియా నేర‌ప‌థ్యంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఈ సినిమాలోని టైటిల‌ల్ పాత్ర‌లో స‌మంత న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో సినిమా మ‌యెసైటీస్ వ్యాధితో పోరాడుతున్నా సామ్ ప్ర‌మోష‌న్స్ ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోష‌ల్ హీడియా వేదిక‌గా ఓ పోస్ట్ ని షేర్ చేసింది. 'జీవితంలో ఏరోజు ఎలా వున్నా...ప‌రిస్థితులు మ‌న‌కు అనుకూలంగా లేక‌పోయినా..వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలి. మ‌న ధైర్యం ఏమిటో నిరూపించుకోవాలి' అని నాకు నా స్నేహితులు చెప్పారు. ఈ మాట‌ల్ని నేను స్ఫూర్తిగా తీసుకుంటున్నా, అందుకే న‌వంబ‌ర్ 11న వ‌స్తున్న‌న 'య‌శోద' ప్ర‌చార కార్య‌క్రమాల్లో పాల్గొంటా' అని వెల్ల‌డించింది.

అన్న‌ట్టుగానే వీడియో ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం మొద‌లు పెట్టింది. సుమ యాంక‌ర్‌గా ఓ వీడియో ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా త‌ను పెట్టిన పోస్ట్ గురించి, ఇటీవ‌ల త‌ను మ‌యోసైటీస్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న విష‌యాన్ని వెల్ల‌డించ‌డం గురించి సుమ ప్ర‌శ్నించ‌డంతో దాని గురించి వివ‌రిస్తూ స‌మంత ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయిపోయి క‌న్నీళ్లు పెట్టుకుంది. త‌న క‌ష్ట‌కాలాన్ని త‌లుచుకుని క‌న్నీళ్లు పెట్టుకుంది.

ఒకానొక స‌మ‌యంలో తాను ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేన‌ని అనిపించింద‌ని, ఇప్పుడు ఆలోచిస్తే ఇక్క‌డి వ‌ర‌కు ఎలా వ‌చ్చానా అని అనిపిస్తుందిని భావోద్వేగానికి లోన‌యి క‌న్నీళ్లు పెట్టుకుంది. ప్ర‌స్తుతం తాను బాగానే వున్నాన‌ని చెప్పుకొచ్చింది.

బ్లాక్ డ్రెస్ లో గాగుళ్స్ ధ‌రించి మునుప‌టికి భిన్నంగా చాలా వీక్ గా క‌నిపించ‌డం అభిమానుల‌ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. త‌న‌లో మునుప‌టి జోష్ కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో ఫ్యాన్స్ ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.