Begin typing your search above and press return to search.
సమంత స్పీచ్ అదిరిపోయిందంతే!!
By: Tupaki Desk | 19 Jun 2017 4:08 AM GMTఅనుకున్నట్లే అయింది. ఈ ఏడాది ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు అందరూ అనుకున్నట్లుగా సమంతనే వరించింది. ఈ విభాగంలో నేను శైలజ చిత్రానికి గాను కీర్తి సురేష్.. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి లావణ్య త్రిపాఠి.. జెంటిల్ మ్యాన్ లో నటించిన నివేదా థామస్.. నాన్నకు ప్రేమతో చిత్రంలో నటనకు రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లిచూపులు చిత్రానికి రీతు వర్మ.. అఆ మూవీ కోసం సమంతలు నామినేట్ అయ్యారు. ఈ ఆరు నామినేషన్స్ లెక్క చూడగానే.. ఈ ఏడాది ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డ్ సమంత గెలుచుకోవడం ఖాయమని అంతా అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగానే ఆమె ఫిలింఫేర్ కొట్టేసింది. అవార్డును తీసుకున్న సందర్భంగా సమంత కామెంట్ ఉంది చూశారూ.. వావ్ అనిపించేసిందంతే.
''చైతన్య అడిగాడు.. అవార్డు గెలుచుకోవడం గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్ అని. నేనే చెప్పాను 'రేపు మన పిల్లలు.. అమ్మా.. నాన్న పెద్ద స్టార్.. మరి నువ్వేంటి? అని అడిగితే.. చూపించుకోవడానికి ఏమన్నా కావాలిగా... ఇది చూపిస్తాను'' అంటూ తన అవార్డును చూపించి.. ఆడియన్స్ తో చెప్పింది సమంత. ఆ మాటకు ఒక్కసారిగా చప్పట్లు మీద చప్పట్లు కొట్టేశారందరూ. చాలా సందర్భాల్లో అవార్డు తీసుకోవడం కంటే.. ఆ అవార్డు వచ్చాక ఇచ్చే స్పీచ్ ఎంతో ప్రాముఖ్యత తెస్తుంది. ఇప్పుడు సమంత కూడా ప్రాక్టీస్ చేసుకుని వచ్చినా.. లేదంటే అక్కడకక్కడే ఆలోచించుకుని చెప్పినా.. తన మాటలతో స్ర్తీ శక్తిని గౌరవించాలి అనే విధంగా.. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక చిన్నపాటి క్లాసిచ్చినట్లుంది.
ఇకపోతే 2013లో తెలుగులో ఈగ చిత్రం కోసం ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్న సమంత ఖాతాలో ఓ అరుదైన రికార్డ్ కూడా ఉంది. అదే 2013 సంవత్సరంలో నీతానే ఎన్ పోన్వసంతం చిత్రానికి గాను తమిళ్ లో కూడా ఉత్తమనటి అవార్డ్ సొంతం చేసుకుంది. ఒకే ఏడాది తెలుగు-తమిళ్ చిత్రాలకు రెండు ఫిలింఫేర్స్ అందుకున్న రికార్డ్ సమంతకు ఉంది. తెలుగులో సమంత అరంగేట్రం చేసిన ఏం మాయ చేశావే చిత్రానికి గాను.. 2010లో ఉత్తమ నూతన నటిగా ఫిలిం ఫేర్ దక్కించుకుంది. ఆ విధంగా ఇప్పటికి నాలుగు ఫిలింఫేర్ బ్లాక్ లేడీలు ఆమెకు సొంతమయ్యాయ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/