Begin typing your search above and press return to search.

ఆ డ్రస్ నా ఐడియా మార్చేసింది -సమంత

By:  Tupaki Desk   |   8 Aug 2017 7:11 AM GMT
ఆ డ్రస్ నా ఐడియా మార్చేసింది -సమంత
X
తెలుగు స్టార్ హీరోయిన్ సమంత సినిమాలు తోనే కాదు తన సేవ కార్యక్రమాలు ద్వారా కూడా అందరి అభిమానాన్ని పొందింది. తెలంగాణ చేనేత వస్త్ర రంగానికి ప్రచారకర్తగా ఉంటూనే ఇప్పుడు గవర్నమెంట్ తో కలిసి ఒక కొత్త డిజైన్ చేనేత దుస్తులు అమ్మకంలో భాగంగా మారింది. నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా నిన్న జరిగిన వోవెన్ - ఏ వాక్ టు ఫ్యాషన్ ఈవెంట్ లో సమంత తన కొత్త డిజైన్ వేర్ వేసుకొని వచ్చి తన కొత్త మిషన్ గురించి మాట్లాడింది.

వోవెన్ ఈవెంట్ లో సమంత మాట్లాడుతూ అందిరి గౌరవాన్ని పొందింది. వోవెన్ - ఏ వాక్ టు ఫ్యాషన్ వేదిక పై సమంత ఏమి అన్నది అంటే “తెలంగాణ రాష్ట్ర చేనేత వస్త్రానికి నేను ప్రచారకర్తగా ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది. నేను నటి అయినందువలనే ఫేమస్ అయి ఉండవచ్చు కానీ కొన్ని ఏళ్ళు నటించిన తరువాత నా గురించి నేను ఆలోచించుకున్నప్పుడు వాళ్ళు నన్ను అంతగా ప్రేమిస్తున్నారు కదా వాళ్ళ కోసం వాళ్ళ జీవితాలలో ఏదైనా చిన్న మార్పు కోసం నా సేవ ద్వారా ఏదైనా చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అందుకే మొదలుపెట్టాను ప్రత్యూష సంస్థను. ఈ సంస్థ ద్వారా కొంత ఆడవాళ్ళకు జీవితాలు ఇవ్వడం నాకు చాల తృప్తిగా ఉంది. నన్ను ఇంతగా అభిమానిస్తున్నారు అంతే అది కేవలం నా నటన వలనే కాదు నా నడవడిక వలన అని కూడా నేను గ్రహించను. వాళ్ళ ఇచ్చిన ఆ ప్రేమతోనే ఇప్పుడు కొన్ని సేవ కార్యక్రమాలను చేయగలుగుతున్నాను'' అని చెప్పింది.

''కొన్ని వేల కుటంబాలు కుల వృతిగా ఉన్న చేనేత పరిశ్రమ రోజు రోజుకు దిగజారిపోతుంది వాటికి పని లేక కొన్ని ఉరులు ఖాళీ అయిపోతున్నాయి అది తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది అని చెప్పింది. ఒక నటిగా నేను మంచి బట్టలు వేసుకోవాలి ఎక్కడకు వెళ్ళిన నా డ్రెస్స్ పైన నా డ్రెస్స్ డిజైన్ పైన అందరి చూపులు ఉంటాయి. కానీ ఒక షాప్ లో నేను ఒకసారి గొప్ప డిజైన్ డ్రెస్స్ ను చూశాను. దాని గురించి అరా తీస్తే అది చేనేత బట్ట అని తెలిసింది. నేను చాలా ఆశ్చర్యపోయాను ఫ్యాషన్ కోసం సినిమా వాళ్ళు చాల ఖర్చు చేస్తాం అది మా వృతిలో బాగం కనుక. కానీ ఆ హ్యాండ్లూమ్ డ్రెస్స్ చూసిన తరువాత నా అభిప్రాయం మారింది అందుకే తెలంగాణ మంత్రి కే‌టి‌ఆర్ గారు అడిగిన తరువాత హ్యాండ్లూమ్ వాళ్ళకి సహాయం చేయడానికి ఇదే సరైన సమయం అని భావించి నేను మంత్రి తారక రామా రావు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను'' అని చెప్పింది.

''చేనేత వస్త్రాలు అమ్మకంలో పదో వంతు ఆ కార్మికుడు అందుతుంది అని తెలిసి నాకు చాల భాద వేసింది. అటువంటి కళను మనం కాపాడుకోవాలి. వాళ్ళ ని ప్రోత్సహించి మరింత గొప్పగా బతికే అవకాశం కలిపించాలి అని అభిప్రాయపడింది. అందుకనే తెలంగాణ గవర్నమెంట్ తో కలిసి సరసమైన ధరకే మంచి డిజైన్ దుస్తులు అందుబాటులో ఉంచడానికి నా వంతు సహకారం అందిస్తున్నాను. ‘వీవర్ విత్ ట్విస్ట్’ అనే పేరు తో కొన్ని డిజైన్ దుస్తులు గవర్నమెంట్ చేనేత షోరూమ్ లలో మీకు తొందరలోనే అందుబాటులోకి వస్తాయి అంటోంది సమంత.