Begin typing your search above and press return to search.

సమంతా ఘాటు.. అక్కినేని ఫ్యాన్సు హర్టు!

By:  Tupaki Desk   |   13 Jan 2020 8:07 AM GMT
సమంతా ఘాటు..  అక్కినేని ఫ్యాన్సు హర్టు!
X
హీరోయిన్లు గ్లామరస్ గా కనిపించడం చాలా సాధారణం. అయితే వివాహం తర్వాత అలానే గ్లామర్ షోలను కంటిన్యూ చేస్తే మన సభ్య సమాజంలో.. మెరుగైన సమాజంలో చాలామందికి నచ్చదు. ముఖ్యంగా ఏదైనా పెద్ద కుటుంబానికి కోడలుగా మారిన తర్వాత స్కిన్ షో చేస్తే అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయి. సమంతా విషయంలో ప్రస్తుతం అదే జరుగుతుంది.

సమంతా మొదటి నుంచి ఆధునిక భావాలు గల హీరోయిన్. గ్లామర్ ప్లస్ యాక్టింగ్ తో సౌత్ లోనే ప్రముఖ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నాగచైతన్యను వివాహమాడి అక్కినేని కుటుంబానికి కోడలుగా మారిన తర్వాత కూడా నటన కొనసాగిస్తూ విజయాలు సాధిస్తోంది. అయితే ఇలాంటి వాటితో అభిమానులకు ఇబ్బందేమీ ఉండదు కానీ సమంతా గతంలో కంటే గ్లామర్ మీటర్ ను పెంచడంతో కొందరు అక్కినేని అభిమానులకు నచ్చడం లేదు. అయితే గతంలో కొందరు అభిమానులు సమంతా డ్రెస్సింగ్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు సమంతా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అయినా ఆ అభిమానులు సమంతాపై విమర్శలు ఆపడం లేదు. రీసెంట్ గా సమంతా జీ సినీ అవార్డ్స్ ఈవెంట్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. డ్రెస్ కాస్త ఘాటుగా ఉండడంతో ఒక సెక్షన్ అభిమానులు.. సంప్రదాయవాదులు గట్టిగా విమర్శలు ఎక్కు పెట్టారు.

అయితే సమంతా ఇలాంటి విమర్శలను పట్టించుకాదని గతంలోనే తేలిపోయింది. కాస్త ఆధునిక భావాలు ఉన్నవారు మాత్రం సమంతా డ్రెస్సింగ్ పై విమర్శలు చేయాల్సిన పనే లేదని.. తన డ్రెస్సింగ్ తన ఇష్టం అని మద్దతు ప్రకటిస్తున్నారు. సమంతా గ్లామర్ ఇండస్ట్రీలో పని చేసే మహిళ అనే వాస్తవం గుర్తుంచుకోవాలని అంటున్నారు.