Begin typing your search above and press return to search.

నాగ శౌర్య సినిమాకు సమంత సపోర్ట్..!

By:  Tupaki Desk   |   8 April 2022 1:30 PM GMT
నాగ శౌర్య సినిమాకు సమంత సపోర్ట్..!
X
యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ''కృష్ణ వ్రింద విహారి''. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షెర్లీ సెటియా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. మరోవైపు మేకర్స్ ముమ్మరంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'కృష్ణ వ్రింద విహారి' ఫస్ట్ లుక్ మరియు టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో 'వర్షంలో వెన్నెల' అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. శుక్రవారం వదిలిన ఈ పాట ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకొని ఫుల్ సాంగ్ కోసం ఆసక్తిగా వేచి చూసేలా చేసింది. ఈ రొమాంటిక్ గీతాన్ని రేపు ఏప్రిల్ 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

స్టార్ హీరోయిన్ సమంతా 'వర్షంలో వెన్నెల' పాటను శనివారం ఉదయం 11.09 గంటలకు లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా తెలియజేసారు. గతంలో 'ఓ బేబీ' సినిమాలో నాగశౌర్య - సామ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యంతో శౌర్య సినిమాకు తన వంతు మద్దతు తెలుపుతోంది సమంత.

'వర్షంలో వెన్నెల' అనేది ప్రధాన జంట నాగ శౌర్య మరియు షిర్లీ సెటియాపై చిత్రీకరించిన రొమాంటిక్ మెలోడీ. ఇందులో వీరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ పండినట్లు అర్థం అవుతుంది. మహతి స్వర సాగర్ స్వరపరిచిన ఈ గీతాన్ని రొమాంటిక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా మేకర్స్ పేర్కొంటున్నారు.

'కృష్ణ వ్రింద విహారి' చిత్రంలో శౌర్య బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. అలనాటి నటి రాధిక శరత్‌ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. శరత్ కుమార్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - బ్రహ్మజీ - సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రామ్‌ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 'కృష్ణ వ్రింద విహారి' చిత్రాన్ని ఏప్రిల్ 22న విడుదల చేయనున్నారు.