Begin typing your search above and press return to search.

చెమటలు కక్కిస్తున్న సమంత..!

By:  Tupaki Desk   |   28 Aug 2021 9:31 AM GMT
చెమటలు కక్కిస్తున్న సమంత..!
X
స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఫిట్ నెస్ పై ఎక్కువ శ్రద్ధ పెడుతుందనే సంగతి తెలిసిందే. క్రమం తప్పకుండా జిమ్ లో కొన్ని గంటల పాటు వర్కౌట్స్ చేస్తూ చెమటలు కక్కిస్తుంది. వందల కేజీల బరువు తేలిగ్గా ఎత్తేసస్తూ.. మగవాళ్లకు సైతం పోటీ ఇస్తోంది. అలానే యోగా ఆసనాలు కూడా వేస్తుంది. యువ హీరో అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఫిట్ నెస్ మీద ఏమాత్రం ఫోకస్ తగ్గించలేదు. జిమ్ లో కసరత్తులు చేసే వీడియోలను సామ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

తాజా ఇన్స్టాగ్రామ్ లో సమంత తన వర్కౌట్స్ కు సంబంధించిన ఓ వీడియోని షేర్ చేసింది. ఇందులో సామ్ కొన్ని ఇంటెన్స్ ఎక్సర్‌సైజ్‌ లు చేస్తూ కనిపిస్తోంది. ఇంతలా కష్టపడుతుంది కాబట్టే పెళ్లి తర్వాత కూడా సామ్ పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి వర్క్ఔట్స్ ఎంతో దోహదం చేస్తాయని చెప్పే సమంత.. లాక్ డౌన్ లో వీడియో కాల్ ద్వారా ఫిట్ నెస్ ట్రైనర్ సలహాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇక సినిమాల విషయానికొస్తే.. 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకుంది సమంత. రాజీ అంటే ఎల్టీటీఈ సభ్యురాలిగా డీ గ్లామర్ లుక్ లో ఆదరగొట్టింది. ఇందుకు గాను మెల్ బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌-2021 లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఫిమేల్ (సిరీస్) అవార్డుకు ఎంపికైంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పాన్ ఇండియా సినిమాలో సామ్ టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. అలానే తమిళ్ లో విజయ్ సేతుపతి - నయనతార లతో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా తర్వాత సమంత కొంత బ్రేక్ తీసుకోవాలని చూస్తున్నట్లు తెలిపారు.