Begin typing your search above and press return to search.
సావిత్రి అనుభవమే నాక్కూడా ఎదురైంది!
By: Tupaki Desk | 17 March 2020 4:00 AM GMT``మహానటి సావిత్రిలాగే నాకూ జరిగింది. లక్కీగా నేను దాన్నుంచి ప్రారంభంలోనే బయటపడ్డాను. నా లైఫ్ ని సేవ్ చేసుకున్నాను`` అని అంటోంది సమంత. ఇటీవల `జాను` సినిమాతో ఫెయిల్యూర్ ని అందుకున్న సమంత లేటెస్ట్ ఇంటర్వ్యూలో వ్యక్తిగత వ్యవహారంపై ముచ్చటించడం అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. సామ్ మూడేళ్ల క్రితం నాగచైతన్యని పెళ్ళి చేసుకుని చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. తను నటించిన మొదటి సినిమా `ఏం మాయ చేసావె` సమయంలో వీరిద్దరు ప్రేమించుకుని ఏడేళ్ల జర్నీ అనంతరం 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు టాలీవుడ్‌లోనే ఆదర్శ జంటగా పేరు తెచ్చుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా అక్కినేని కోడలు సమంత ఓ ఇంటర్వ్యూ లో తెలిపిన విషయాలు నెటిజనులను షాక్ కి గురి చేసాయి. తన గత ప్రేమ గురించి ఇన్ డైరెక్ట్ గా వెల్లడించింది `ఓ బేబీ` స్టార్. కాకపోతే గతం నుంచి త్వరగా బయట పడిందట. ఆ విశేషాలు చెబుతూ, ``సావిత్రి లాగానే నేను కూడా ఒకానొక సమయంలో క్రైసిస్ లో పడ్డాను. ఆ బంధం సరైనది కాదని ప్రారంభంలోనే రియలైజ్ అయ్యాను. దీంతో త్వరగా కోలుకుని దాన్నుంచి బయట పడ్డాను. ఆ తర్వాత నాగచైతన్య వంటి మంచి భర్త దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. తను అన్ని విషయాల్లో జెమ్స్`` అని వెల్లడించింది. దీంతో నెటిజనులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పెళ్ళి చేసుకుని హాయిగా లైఫ్ సాగుతున్న సమయంలో సామ్ ఇలా మాట్లాడిందేంటి? అనే డౌట్ ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
హీరో సిద్ధార్థతో సామ్ డేటింగ్ వ్యవహారం అందరికీ తెలిసినదే అయినా.. దాని గురించి మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ జంట `జబర్దస్త్` టైమ్ లో ప్రేమలో ఉన్నారని పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరిద్దరు బ్రేకప్ తీసుకోవడం సంచలనమైంది. మళ్ళీ నాగచైతన్యతో డేటింగ్ చేయడం... అతడితో చక్కని అనుబందాన్ని కొనసాగించి చివరికి పెళ్ళి చేసుకోవడం తెలిసిన కథే.. ఇక మహానటి సావిత్రి కూడా జెమినీ గణేషన్ ని ప్రేమించి ఆయన్నిపెళ్ళి చేసుకున్న విషయం విదితమే. ఆయన వల్లే తన కెరీర్ నాశనమైందనేది జగమెరిగిన సత్యం. సావిత్రిలా తాను కూడా చేస్తే నా జీవితం కూడా క్రైసిస్ లో పడేదని పరోక్షంగా సమంత చెప్పకనే చెప్పింది. ఇక ప్రస్తుతం సమంత తమిళంలో నయనతార- విజయ్ సేతుపతిలతో కలిసి `కాథువాకుల రెండు కాదల్` చిత్రంలో నటిస్తుంది. దీనికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రంలో ప్రశాంత్ తో జోడీ కట్టబోతుంది.