Begin typing your search above and press return to search.

సమంత సీక్రెట్ చెప్పిందా? ఆట పట్టించిందా?

By:  Tupaki Desk   |   24 Nov 2016 5:33 AM GMT
సమంత సీక్రెట్ చెప్పిందా? ఆట పట్టించిందా?
X
తన ట్వీట్స్ తో పంచ్ లు వేయడంలో సౌత్ బ్యూటీ సమంతకు బోలెడంత ట్యాలెంట్ ఉంది. అలాగే తనకు తెలిసిన విషయాన్ని నిర్మొహమాటంగా నిలదీసేయడంలో కూడా. కోలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ కి.. సమంత వేసిన ఓ ప్రశ్న ఇప్పుడు చాలామందికి చాలా రకాల డౌట్స్ పుట్టించేస్తోంది.

అనిరుధ్ రవిచందర్ పై ప్రస్తుతం కోలీవుడ్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కుర్రాడికి ఎంగేజ్మెంట్ అయిపోయిందని.. సీక్రెట్ గా జరిగిపోయిందని వార్తలు రావడంతో.. వీటన్నిటినీ ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు అనిరుధ్. అంతే కాదు ట్విట్టర్ ఇదే విషయాన్ని కన్ఫాం చేస్తూ ట్వీట్ కూడా పెట్టాడు. 'ఎంగేజ్మెంటా.. హహహహ.. నేనింకా సింగిల్ గా ఉన్న కుర్రాడినే' అన్నాడు అనిరుధ్. ఇక్కడితే ఇష్యూ ఆగిపోవాలి కానీ.. సమంత మళ్లీ డౌట్స్ మొదలయ్యేలా చేసింది.

'కానీ తను స్వీట్ గాళ్ కదా. ఏమైంది?' అంటూ అనిరుధ్ ని ట్విట్టర్ లోనే ప్రశ్నించింది శామ్స్. అంటే ఆ అమ్మాయి తనకు తెలుసని.. ఎంగేజ్మెంట్ నిజమే అని అన్నట్లుగా ఉంది సమంత వాలకం. అయితే.. రూమర్లపై అనిరుధ్ ని ఆట పట్టించేందుకు ఇలా ట్వీట్ చేసిందా? లేక నిజంగానే సమంతకి మరేదైనా మేటర్ తెలుసా? అనుకోవాల్సి వచ్చింది. 'హహహహ శామ్' అంటూమళ్లీ ట్వీట్ పెట్టి ఈ టాపిక్ ఇక్కడితో క్లోజ్ చేసేందుకు ట్రై చేశాడు అనిరుధ్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/