Begin typing your search above and press return to search.

సామ్ భర్త ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో కదా..!

By:  Tupaki Desk   |   22 May 2020 10:10 AM GMT
సామ్ భర్త ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో కదా..!
X
టాలీవుడ్ లో అక్కినేని నాగచైతన్య - సమంత జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'ఏమాయ చేసావే' సినిమాలో కలిసి నటించిన చెయ్ - సామ్ ఆ తర్వాత రోజుల్లో ఇద్దరూ వివాహం చేసుకొని కలిసి పోయారు. అక్కినేని వారి కోడలుగా సామ్ తమ నడవడికతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక సమంత వివాహం తర్వాత కూడా కెరీర్‌ ను నిర్లక్ష్యం చేయకుండా వరుసగా సినిమాలు చేస్తోంది. అటు వృత్తిపరంగా ఇటు వ్యక్తిగతంగానూ తన పని తాను చక్కగా చేసుకుంటోంది సామ్. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఇంకోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసే విధానం చూసి ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్య పోతున్నారు. అక్కినేని వంటి పెద్ద కుటుంబంలో అడుగు పెట్టిన ఆమె తన కుటుంబంతో.. భర్త నాగ చైతన్య తో తన అనుబంధాన్ని ఎప్పటికప్పుడు దాచుకోకుండా సందర్భం వచ్చినప్పుడు సోషల్‌ మీడియా వేదికగా చెబుతూనే ఉంటుంది. సమంత సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటారనే సంగతి తెలిసిందే. సామాజిక అంశాలపై స్పందించడమే కాకుండా.. అప్పుడప్పుడూ తన భర్త నాగచైతన్యను ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు కూడా చేస్తారు.

కాగా ఇటీవల జరిగిన దగ్గుబాటి రానా - మిహికా బజాజ్ ల రోకా ఫంక్షన్‌ లో నాగచైతన్య - సమంత దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్‌ చేశారు. ముందుగా రానా - మిహీకా దంపతులతో దగ్గుబాటి ఫ్యామిలీ మరియు చెయ్ - సామ్ కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ''2020లో ఒక మంచి శుభవార్త చెప్పినందుకు రానా - మిహీకాలకు థ్యాంక్స్‌'' అని పోస్ట్ చేసారు. ఆ తర్వాత భర్త నాగచైతన్య ఫొటో షేర్‌ చేసిన సమంత.. ఆయనను ఆటపట్టించేలా ఫన్నీగా కామెంట్ చేశారు. ''అమ్మ - ఆంటీ - బంధువులు - స్నేహితులు అందరిని పంపించిన తర్వాత ఇప్పుడు ఇన్‌ స్టాగ్రామ్‌ సమయం వచ్చింది. చూడండి నా భర్త ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో కదా..?? (నా భర్త ఎక్కడో ఒక్క పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు)'' అని క్యాప్షన్ లో పేర్కొన్నారు సమంత. నిజంగా ఈ ఫొటోలో చైతూ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఫార్మల్ డ్రెస్ లో నీట్ గా టక్ చేసి లవ్ స్టోరీ గెటప్ లో కనిపిస్తున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయింది. కాగా దీనిపై అంతే సరదాగా స్పందించిన నాగచైతన్య.. ''ఓకే నౌ.. చూస్తుంటే ఇది ఇతరుల పార్టనర్ షిప్ తో చేసిన పెయిడ్‌ పోస్ట్‌ లలో ఒకటిగా కనిపిస్తుంది'' అని కామెంట్ చేసారు. వీరి సరదా సంభాషణ చూసి అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.