Begin typing your search above and press return to search.

అభిమానుల‌కు సమంత `డ‌బ్ స్మాష్` చాలెంజ్!

By:  Tupaki Desk   |   29 April 2018 9:27 AM GMT
అభిమానుల‌కు సమంత `డ‌బ్ స్మాష్` చాలెంజ్!
X
అల‌నాటి అందాల తార‌, లెజెండ‌రీ హీరోయిన్ సావిత్రి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న‌ `మ‌హాన‌టి` బ‌యోపిక్ కోసం ప్రేక్షకులు ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తోన్న సంగ‌తి తెలిసిందే. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో అక్కినేని స‌మంత జ‌ర్న‌లిస్టు మ‌ధుర‌వాణి పాత్ర పోషించింది. కొద్ది రోజుల క్రితం విడుద‌లైన మ‌ధుర‌వాణి గెట‌ప్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. మే 9న విడుద‌ల కాబోతోన్న ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను చిత్ర యూనిట్ మొద‌లు పెట్టింది. అయితే, అంద‌రిలా కాకుండా ఈ సినిమాకు వినూత్న త‌ర‌హాలో ప్ర‌మోట్ చేయాల‌ని చిత్ర యూనిట్ నిర్ణ‌యించింది. అందులో భాగంగానే, స‌మంత ఓ డ‌బ్ స్మాష్ కాంటెస్ట్ లో పాల్గొనాల‌ని అభిమానుల‌కు పిలుపునిచ్చింది.

`మ‌హాన‌టి` సినిమాలో ఎవ‌ర్ గ్రీన్ సూప‌ర్ హిట్ సాంగ్ `అహ నా పెళ్లంట‌`ను రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పాపుల‌ర్ పాట‌ను డ‌బ్ స్మాష్ కాంటెస్ట్ కోసం చిత్ర యూనిట్ వాడుకోనుంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొనాల‌నుకునే వారు ఆ పాట‌ను డ‌బ్ స్మాష్ చేసి స‌మంత‌కు షేర్ చేస్తే చాలు. అన్ని డ‌బ్ స్మాష్ వీడియోల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత ....వాటిలోని బెస్ట్ వెర్ష‌న్స్ ను స‌మంత ఎంపిక చేస్తుంది. అంతేకాదు, ఆ బెస్ట్ వెర్ష‌న్స్ పాడిన వారికి స‌మంత ప్ర‌త్యేక‌మైన బ‌హుమ‌తులు అంద‌జేస్తుంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స‌మంత ఇప్ప‌టికే ఈ డ‌బ్ స్మాష్ కు సంబంధించిన ప్ర‌మోష‌న్ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. తన మొబైల్‌లో `అహ నా పెళ్ళంట`పాట వీడియోను చూస్తూ ఉత్సాహంగా ఉన్న స‌మంత ....ఆ కాంటెస్ట్ గురించి వివ‌రిస్తుంది. ఆ పాట‌లో న‌టించ‌డం చాలా కష్టమ‌ని....అందుకే సావిత్రి గారిని మహానటి అంటార‌ని స‌మంత త‌న‌దైన క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో అద‌ర‌గొట్టింది. `అహ‌ నా పెళ్లంట‌` డ‌బ్ స్మాష్ వీడియోస్ చేసి త‌న‌కు పంపాల‌ని, త‌న‌కు నచ్చిన వీడియోస్ చేసిన వారికి స్పెషల్ గిఫ్ట్ పంపిస్తాన‌ని స‌మంత ముద్దు ముద్దుగా చెప్పింది. సావిత్రి గారి పాట పాడి స‌మంత ఇచ్చే స్పెష‌ల్ గిఫ్ట్ ను అందుకునేందుకు అభిమానులు త‌మ గొంతును స‌వ‌రించుకుంటున్నారు. ఎంత‌మంది స‌మంత పంపే ల‌క్కీ గిఫ్ట్ ను అందుకుంటారో వేచి చూడాలి మరి!

వీడియో చూడటానికి క్లిక్ చేయండి