Begin typing your search above and press return to search.
సమంత 15 సినిమాల రికార్డ్?
By: Tupaki Desk | 23 Aug 2018 5:10 AM GMTఇన్నాళ్లు ఓవర్సీస్ రికార్డులు అంటే మహేష్ - పవన్ - చరణ్ - ప్రభాస్ అంటూ లెక్కలు చెప్పుకునేవాళ్లం. ఇకమీదట కథానాయికల కోణంలోనూ ఓవర్సీస్ గణాంకాల్ని లెక్కించాల్సి వస్తే.. ? అలాంటి సీన్ మునుముందు ఉంటుందా? అంటే ఛాన్సుందనే అంచనా వేస్తున్నారు. తెలుగు సినిమా రాంగ్ టర్న్ నుంచి రైట్ టర్న్ తీసుకుని నాలుగేళ్లయింది. బాహుబలి తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఇటీవలి కాలంలో ప్రయోగాత్మక సినిమాలు అయితేనే జనం చూస్తున్నారు. భారీ విజువల్ గ్రాండియారిటీనో లేదా ఏదైనా వెరైటీనో ఉంటేనే సినిమాలకు మనుగడ అన్న చందంగా సీన్ మారిపోయింది. పనిలోపనిగా నాయికా ప్రధాన చిత్రాలకు గిరాకీ అంతకంతకు పెరుగుతోంది.
ఈ వెల్లువలోనే నయనతార, అనుష్క, సమంత, తమన్నా లాంటి అగ్రకథానాయికలకు కొత్త దారి తెరుచుకుంది. దమ్మున్న నాయికా ప్రధాన స్క్రిప్టు ఎంచుకుని నటిస్తే తప్పకుండా వీళ్లకంటూ ఓ మార్కెట్ రేంజు ఉందని ప్రూవ్ అవుతోంది. రీసెంటుగా తమిళంలో రిలీజైన `కోలమావు కోకిల` చిత్రమే అందుకు ఎగ్జాంపుల్. నయనతార బ్రాండ్ తోనే ఈ సినిమా 50 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెట్టేస్తోంది. అంతకుముందు అరుంధతి - భాగమతి చిత్రాలతో అనుష్క - మహానటి చిత్రంతో కీర్తి సురేష్ అదే పని చేశారు. రంగస్థలం - మహానటి లాంటి చిత్రాలతో సమంత ఆ స్థాయిని అందుకుంది.
ఒక్క సమంతనే పరిశీలిస్తే ఈ భామ నటించిన 14 సినిమాలు అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరాయంటే ఆశ్చర్యం కలగక మానదు. 2018లో రంగస్థలం -3.5 మిలియన్ డాలర్లు (25కోట్లు) - మహానటి -2.56 మిలియన్ డాలర్లు వసూలు చేశాయి. ఈ రెండిటిలో సామ్ నటనకు గొప్ప పేరొచ్చింది. అంతకుముందు సమంత నాయికగా నటించిన 12 సినిమాలు వన్ మిలియన్ డాలర్ క్లబ్ ని చేరుకున్నాయి. అందుకే ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అవుతున్న `యూటర్న్` పైనా ఓవర్సీస్ లో భారీ అంచనాలేర్పడ్డాయి. సమంత దూకుడు ఈ సినిమాకి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 13న సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజవుతోంది. అంటే .. సెప్టెంబర్ 12 సాయంత్రం ప్రీమియర్ల సందడి మొదలవుతుంది. వినాయక చవితి సెలవుల్ని సామ్ యూటర్న్ క్లీన్ స్వీప్ చేస్తుందనే అంచనా వేస్తున్నారు. ఆసక్తికరంగా అదేరోజు సమంత నటించిన సీమరాజా (తమిళ్ - తెలుగు) రిలీజ్ కి రెడీ అవుతోంది. ఒకవేళ యూటర్న్ చిత్రం అమెరికాలో 1మిలియన్ డాలర్ వసూలు చేస్తే ఇది సామ్ కి 15వ సినిమా అవుతుంది.