Begin typing your search above and press return to search.
సమంతను అలా చూసి తట్టుకోగలరా?
By: Tupaki Desk | 9 Nov 2015 11:30 AM GMTసమంత కెరీర్ లో ఇప్పటిదాకా అన్నీ ‘కాస్ట్ లీ’ క్యారెక్టర్లే చేసింది. చీరకట్టులో కనిపించినా.. మోడర్న్ డ్రెస్సింగ్ లో కనిపించినా.. ఆమె ఎప్పుడూ రిచ్ అమ్మాయిగానే చేసింది. సమంత లాంటి అమ్మాయిలు పేదింటి అమ్మాయిగానో, డీగ్లామరస్ రోల్స్ లోనో చేస్తే అభిమానులు జీర్ణించుకోలేరేమో. ఆమె ఫీచర్స్ అలాంటివి మరి. అలాంటి సమంతను ఓ మురికివాడలో పెరిగే పేదింటి అమ్మాయిగా చూపిస్తే ఎలా ఉంటుంది? ఇది ఎవరికీ ఊహకైనా అందని విషయం. ఐతే తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ ఈ సాహసం చేయబోతున్నాడు.
ధనుష్ కు నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన ‘ఆడుగళం’ సినిమా తీసిన దర్శకుడు వెట్రిమారన్. మళ్లీ తన ఫేవరెట్ హీరోతో ఇంకో సినిమా చేస్తున్నాడు. అదే.. ‘వాడా చెన్నై’. ఇందులో ధనుష్ డాన్ క్యారెక్టర్ చేస్తున్నాడట. సమంతది స్లమ్ గర్ల్ పాత్ర అని చెబుతున్నారు. ఇందులో ఆమె డీగ్లామర్ రోల్ చేయబోతోందట. మేకప్ కూడా ఉండదట. ఐతే చాలా డెలికేట్ గా కనిపించే సమంత ఇలా స్లమ్ గర్ల్ పాత్రలో కనిపిస్తే ఆమె అభిమానులు తట్టుగోలరా అనేది సందేహం. మొత్తానికి సమంత పెద్ద సాహసానికే రెడీ అయినట్లుంది.