Begin typing your search above and press return to search.
నెలకు రూ. 3 కోట్లు.. ఆ విషయంలో సమంతనే టాప్
By: Tupaki Desk | 13 Jun 2022 4:02 AM GMTగత కొన్నేళ్ల నుంచీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న సమంత గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. రీల్ లైఫ్ లో సూపర్ సక్సెస్ అయిన ఈ బ్యూటీ.. రియల్ లైఫ్ లో మాత్రం ఫెయిల్ అయింది. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమాయణం నడిపించిన సమంత.. 2017లో గోవా వేదికగా కుటుంబసభ్యుల నడుమ అంగరంగవైభవంగా అతడిని పెళ్లి చేసుకుంది. వివాహం అనంతరం ఇటు కెరీర్ ను, అటు ఫ్యామిలీ లైఫ్ ను బాగానే బ్యాలెన్స్ చేసిన సమంత.. సడెన్ గా విడాకుల వైపు టర్న్ తీసుకుంది.
కొద్ది నెలల క్రితమే నాగచైతన్య, సమంతలు విడిపోయారు. ఆ తర్వాత సమంత పేరు వార్తల్లో మారుమోగిపోయింది. కొందరు నెటిజన్లు విడాకుల విషయంలో సమంతదే తప్పంటూ ఆమెను మానసికంగా కృంగదీసే ప్రయత్నాలు చేశారు. కానీ, అవేమి పట్టించుకోకుండా సమంత కెరీర్ పైనే ఫోకస్ పెట్టి.. వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టివ్ గా ఉండే సమంత.. తరచూ అదిరిపోయే ఫోటో షూట్లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది. అలాగే చిట్ చాట్ సెషన్స్ నిర్వహిస్తూ అభిమానులను మరింత చేరువవుతోంది. దాంతో ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో సామ్ కు రెండు కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
అయితే ఫాలోవర్స్ పరంగానే కాదు ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చే ఆదాయం పరంగానూ సమంతనే టాప్ అని అంటున్నారు. సమంత ఒకవైపు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూనే మరోవైపు వాణిజ్య ప్రకటనలలో నటిస్తుంది.
ఇంకోవైపు సోషల్ మీడియా ద్వారా కూడా పలు బ్రాండ్స్‌ని ప్రమోట్ చేస్తోంది. ఫాలోవర్స్, పాపులారిటీని బట్టి వ్యాపార సంస్థలు తమ ప్రకటనల కోసం భారీ మొత్తంలో తారలకు చెల్లిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే సమంత ఇన్స్టాగ్రామ్ ద్వారా నెలకు ఏకంగా రూ. 3 కోట్ల మేర సంపాదిస్తుందని అంటున్నారు. అంతేకాదు, సౌత్ లో ఇన్‌స్టా ద్వారా అత్యధిక ఆదాయం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో సమంతనే తొలి స్థానంలో ఉందని కూడా టాక్ నడుస్తోంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సామ్ 'శాకుంతలం', 'యశోద', 'ఖుషి' చిత్రాలు చేస్తోంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం ఆమె చేతిలో ఉన్నాయి.