Begin typing your search above and press return to search.
వీడియో: జిమ్ లో సమంత హార్డ్ వర్క్ కి పరేషానులే
By: Tupaki Desk | 6 Aug 2021 1:30 PM GMTగత కొంతకాలంగా సమంత పేరు ఇంటా బయటా మార్మోగుతోంది. నటిగా మరో మెట్టు ఎక్కిందంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన `ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2`లో సామ్ నటన గురించి సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. రాజీ అనే ఎల్.టి.టి.ఇ తీవ్రవాది పాత్రలో అద్భుత నటనతో సమంత ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సమంత తదుపరి నెట్ ఫ్లిక్స్ లో భారీ వెబ్ సిరీస్ లో నటించనున్నారని కథనాలొచ్చాయి.
మరోవైపు ఇంత బిజీ షెడ్యూల్స్ లోనూ సామ్ లోని ఫిట్నెస్ ఫ్రీక్ అస్సలు నిదురపోదు. నిరంతరం జిమ్ కి అంకితమై ఫిట్నెస్ విషయంలో రాజీలేని ప్రయత్నం చేయడం విస్మయపరుస్తోంది. తాజాగా షోల్డర్ .. వెన్నెముక బలం పెంచే కసరత్తులు చేస్తూ జిమ్ లో ప్రత్యక్షమైంది. అందుకు సంబంధించిన వీడియోను సమంత స్వయంగా షేర్ చేయగా వైరల్ గా మారింది.
ఫిట్నెస్ ఫ్రీక్ సమంత యోగా సెషన్స్ తో పాటు జిమ్ వీడియోలు రెగ్యులర్ గా యువతరంలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నాయి. ఇంతకుముందు తన స్నేహితురాలు ఉపాసన కొణిదెలతో కలిసి ఫిట్నెస్ తరగతులను చెప్పారు సామ్. నిరంతరం జిమ్ చేస్తే కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. మునుముందు వెబ్ సిరీస్ లతో అంతర్జాతీయ స్థాయి పాపులారిటీ దక్కనుందని అర్థమవుతోంది. అందుకే ఫిట్నెస్ విషయంలో ఎక్కడా తగ్గేదేలే అంటూ ఇంతగా శ్రమిస్తోంది.
సినీకెరీర్ పరంగా చూస్తే.. గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం శాకుంతలం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. నయనతార.. విజయ్ సేతుపతి నాయకానాయికలుగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న `కాతువాకుల రేండు కాదల్` షూటింగ్ లోనూ సామ్ జాయిన్ కానుంది. అలాగే ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీలో సమంత ఓ కీలకపాత్రలో నటించనుంది.