Begin typing your search above and press return to search.
#మీటూ: నీకూతురికి ఏం చెప్తావ్..?
By: Tupaki Desk | 11 Oct 2018 4:59 PM GMTసోషల్ మీడియాను చాలామంది తిట్టిపోస్తుంటారు గానీ దీనివల్ల #మీటూ కాంపెయిన్ కు అందినంత సహకారం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అందేదా అని ప్రశ్నించుకుంటే.. 'అంది ఉండేది కాదు. అందదు' అని చేదు నిజాన్ని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. మీరుగనక 'ఎందుకలాగ?' అని అడిగితే.. 'హీరో ఒక పార్టీ వాడైతే ఒక రకం రిపోర్ట్.. అవతలిపక్షం వాడైతే మరో రకం రిపోర్ట్ ఇచ్చేందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా అలవాటు పడిందన్న సత్యం ఒప్పుకోవాల్సి వస్తుంది." అలా అని సోషల్ మీడియాలో వచ్చేదంతా నిజమని నమ్మితే మనంత వెర్రోళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు.
ఇక ఈ నిజానిజాల సంగతి పక్కనబెడితే #మీటూ కాంపెయిన్ ఈమధ్య ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ కాంపెయిన్ లో భాగంగా సింగర్ చిన్మయి శ్రీపాద తనకెదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించడమే కాకుండా పాపులర్ తమిళ గేయ రచయిత వైరముత్తు ద్వారా ఇబ్బందిపడ్డానని తెలిపింది. ఇక అయన వల్ల ఇబ్బంది పడిన ఇతర సింగర్స్ పెట్టిన ట్వీట్స్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఇదిలా ఉంటే సమంతా అక్కినేని #మీటూ కాంపెయిన్ కు మద్దతు తెలుపుతూ చిన్మయికి సపోర్ట్ చేస్తున్నానని వెల్లడించింది.
ఇలా #మీటూ కాంపెయిన్ కు మద్దతు తెలిపిన తర్వాత సమంతా తన అభిమానులతో ట్విట్టర్ లో చాట్ చేసినప్పుడు #మీటూ కాంపెయిన్ పై ప్రశ్నలు ఎదురయ్యాయి. #మీటూ కాంపెయిన్ ను తక్కువచేస్తూ మాట్లాడిన వారికి షార్ప్ కౌంటర్స్ ఇచ్చింది సామ్. "13 ఏళ్ల తర్వాత ఈ విషయం బయట పెట్టారు. ఇప్పుడు బయట పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇంత లేటుగా ఆరోపణలు చేయడం యాక్సెప్ట్ చేయబోము అని ఓ నెటిజన్ అంటే.. "మేము భయపడడానికి కారణం కూడా అదే. మీలాంటి వారు మమ్మల్ని తప్పుపడతారని తెలిసే ఇలా చేయాల్సివచ్చింది" అని కౌంటర్ ఇచ్చింది.
మరో నెటిజన్ "ఈరోజు మా అబ్బాయి నన్ను అసలు 'మీటూ' అంటే ఏంటి?' అని అడిగాడు. అప్పుడు నేను "మీటూ అంటే ఆడవారి రిటైర్మెంట్ బీమా పథకం" అని చెప్పాను. అదేంటని మా అబ్బాయి మళ్ళీ ఆడిగితే "ఆడవాళ్లు అన్ని విషయాల్లో వేలు పెడతారు. కెరీర్ ముగిశాక ఈ బీమాను వాడుకుంటారు. అప్పుడు వాళ్ల గురించి బర్ఖా దత్.. ఆర్ణబ్ లాంటి వారు కవర్ చేస్తారు'' అన్నాను. దీంతో మా అబ్బాయి "దేవుడా ఈ దేశాన్ని బాగు చేయి" అని అన్నాడని చెప్పాడు. దీంతో సమంత "అదే ప్రశ్న నీ కూతురు అడిగితే ఏం చెబుతావ్?" అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.