Begin typing your search above and press return to search.
సమంతాను ఆకట్టుకున్న మలయాళం ఉయరే!
By: Tupaki Desk | 4 Jun 2019 12:07 PM GMTసమంతా అక్కినేని ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇటు తెలుగు అటు తమిళంలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటుంది. ఓ వారం రోజులు గ్యాప్ దొరికితే చాలు తన స్వీట్ హబ్బీ నాగ చైతన్యతో కలిసి ఫారెన్ వెకేషన్ కు చెక్కేస్తుంది. అయితే ఎంత బిజీగా ఉన్నా తను నటించే సినిమాలనే కాకుండా ఇతర సినిమాలను కూడా చూస్తూ ఉంటుంది. తనకు నచ్చితే వాటిని ప్రశంసించడం మర్చిపోదు. తాజాగా ఒక మలయాళం సినిమాను చూసిన సామ్ ఆ టీమ్ ను ట్విట్టర్ ద్వారా మెచ్చుకుంది.
తన ట్విట్టర్ ద్వారా "#ఉయరే.. మీరు చూడండి. మీకు కోపం తెప్పిస్తుంది.. మిమ్మల్ని ఏడిపిస్తుంది.. ఆలోచింపజేస్తుంది.. ప్రమించేలా చేస్తుంది..నమ్మకాన్ని కలిగిస్తుంది.. ప్రేరణనిస్తుంది. థ్యాంక్ యూ పార్వతి.. మిమల్ని చూసి గర్విస్తున్నా. డైరెక్టర్ మను.. రచయితలు బాబీ సంజయ్.. టీమ్ మీరు బ్రిలియంట్ గా పని చేశారు." అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. ఈ ట్వీట్ కు స్పందనగా మలయాళ నటి పార్వతి రిప్లై ఇస్తూ సమంతాకు కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సినిమాలో పైలట్ కావాలనే ధ్యేయం ఉన్న అమ్మాయి పాత్రలో పార్వతి నటించింది. తనకు పైలట్ ట్రైనింగ్ సెంటర్ లో అడ్మిషన్ వచ్చిన తర్వాత ముంబై కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఆ సమయంలోనే విపరీతంగా ప్రవర్తించే పొసెసివ్ మనస్తత్వం కల తన ప్రియుడికి బ్రేకప్ చెప్తుంది. కానీ అతను యాసిడ్ దాడి చేస్తాడు. ఈ సంఘటన తర్వాత ఆ అమ్మాయి లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ 'ఉయరే' లో మిగతా కథ.