Begin typing your search above and press return to search.
ఇలాగైతే ఎలా సమంతా
By: Tupaki Desk | 24 May 2016 4:23 AM GMTపెళ్లి గురించి అంతా తానే చెప్పింది. కుర్రాడు ఓ యంగ్ హీరో అని, అతను చాలా మంచి వాడనీ, వంట బాగా చేస్తాడని... ఇలా చెప్పాల్సిందంతా చెప్పేసింది. ఇప్పుడేమో నా పెళ్లి గురించి ఎవరూ మాట్లాడొద్దంటోంది. ఇలాగైతే ఎలా చెప్పండి? అసలే సమంత ఓ స్టార్. మరి ఆమెని పెళ్లి చేసుకొనేది ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటుంది కదా!
మొన్న ఓ తెలుగు డైలీలో వచ్చిన ఇంటర్వ్యూ చదివినప్పట్నుంచి అందరూ ఎవరే అతగాడు అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. చివరికి ఓ పెద్దింటి అబ్బాయి అని రూడీ చేసుకొని వాళ్లిద్దరి జోడీని మరోసారి ఊహించుకొంటూ గడుపుతున్నారు. ఈ వార్త విన్న వెంటనే నిర్మాతలు కాస్త కలవరానికి గురయ్యారట. అసలే హీరోయిన్లు లేక ఇబ్బంది పడుతుంటే ఇక సమంత కూడా పెళ్లి చేసుకొని సినిమాలకి గుడ్ బై చెప్పేస్తే మాకు దిక్కెవరనేది వాళ్ల బాధ. ఆమెతో ఇప్పటికే కమిట్ అయిన నిర్మాతలంతా వీలైనంత త్వరలోనే సమంతతో సినిమా తీసేయాలని ఫిక్సయిపోతున్నారు. ఈ రకంగా రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా సమంత పెళ్లికి సంబంధించిన టాపిక్కే వినిపిస్తోంది. అభిమానులు కూడా ట్విట్టర్ లో సమంతని పెళ్లి గురించి ఒకటే ఆరాలు తీస్తున్నారట. దీంతో సమంత స్పందించింది.
నేను చెప్పేవరకు నా పెళ్లి గురించి ఎవరూ మాట్లాడొద్దు అంటూ ట్వీట్ చేసింది. అయినా మాట్లాడుకొనేలా చేసి మాట్లాడొద్దంటే ఎలా చెప్పండి? టూ మచ్ కాకపోతే! సమంత, ఆమె ప్రియుడు మాత్రం వచ్చే యేడాది పెళ్లి చేసుకోవాలని పక్కాగా ఫిక్సయినట్టు ప్రచారం జరుగుతోంది.