Begin typing your search above and press return to search.
విడాకులిచ్చినా సరే.. అంటున్న సమంత
By: Tupaki Desk | 25 Sep 2015 6:24 AM GMTసర్.. మీరు నాకు విడాకులిచ్చినా సరే, ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా. హ్యాపీ బర్త్ డే... బోలెడంత ప్రేమ - సంతోషం - విజయాలు మీకు భవిష్యత్తులో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నా అంటూ ఓ దర్శకుడిని ఉద్దేశించి ట్వీట్ చేసింది సమంత. అసలు సమంతకి విడాకులిచ్చిన ఆ దర్శకుడు ఎవరు? సమంతకి ఇదివరకే పెళ్లై - విడాకులు కూడా అయిపోయాయా? ఈ ట్వీట్లు ఎవరనుద్దేశించి చేసింది? ఇప్పుడు మీకు ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి కదా! అంత డీప్ గా ఆలోచించకండి. ఇదంతా దర్శకుడు మురుగదాస్ కి సమంత బర్త్ డే విషెస్ చెప్పిన వ్యవహారమే.
విడాకులు ఇచ్చినా సరే అని మురుగదాస్ తో సమంత ఎందుకందంటే... మురుగ నిర్మాణంలో ఓ సినిమా చేసిందామె. అదే... విక్రమ్ కథానాయకుడిగా నటించిన 10 ఎంద్రతుకుల్లా. విజయ్ మిల్టన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇటీవలే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అయితే సమంతకి ఈ యూనిట్ చాలా బాగా నచ్చిందట. అందుకే చివరి రోజు వెక్కిళ్లు పట్టేలా ఏడుస్తూ సెట్ నుంచి వెళ్లిపోయిందట. అంత ఎఫెక్షన్ సెట్ లో దొరికిందన్నమాట. సినిమా పూర్తయిపోవడమే విడాకులు తీసుకొన్నంత భాద సమంతలో కలిగిందన్నమాట. అందుకే నిర్మాత అయిన మురుగదాస్ కి `మీరు విడాకులిచ్చి పంపినా సరే.. ` అంటూ సమంత ట్వీట్ చేసిందన్నమాట. అయినా ఈ కాలంలో సినిమా ఎప్పుడు పూర్తవుతుందా? ఎప్పుడు సెట్ నుంచి వెళ్లిపోదామా అని చూస్తుంటారు హీరోయిన్లు. కానీ సమంత మాత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని, మంచి మనుషులకి దూరమవుతున్నానని ఎంత భాద పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆమె డెడికేషన్ కీ - యూనిట్ పై చూపే ఎఫెక్షన్ కి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. అందుకే మురుగ కూడా సమంత నువ్వెప్పుడు మా స్వీట్ హార్ట్ వే అంటూ బదులుగా ట్వీట్ చేశాడు. అదన్నమాట సంగతి.