Begin typing your search above and press return to search.

సమంతా భుజాలపై పెద్ద భారం

By:  Tupaki Desk   |   12 Sep 2018 5:37 AM GMT
సమంతా భుజాలపై పెద్ద భారం
X
రేపు విడుదల కాబోతున్న చైతు సామ్ ల సినిమాలు శైలజారెడ్డి అల్లుడు-యుటర్న్ ల కోసం ట్రేడ్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గీత గోవిందం తర్వాత కాస్త చెప్పుకోదగ్గ స్టార్లు ఉండి కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద మెప్పించిన భారీ సినిమా ఏదీ లేదు. అందుకే వీటి మీద హైప్ బాగా ఉంది. శైలజారెడ్డి అల్లుడులో ఆకర్షణలకు కొదవ లేదు కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ థ్రిల్లర్ జానర్ లో కేవలం సమంతా ఇమేజ్ ని ఆధారం చేసుకుని మార్కెట్ చేస్తున్న యుటర్న్ కు మాత్రం ఇది అంత తేలిక కాదు. థియేట్రికల్ రైట్స్ ని సుమారు 15 కోట్ల దాకా అమ్మారని సమాచారం. ఇందులో ఓ ఐదారు కోట్లు తమిళ్ వెర్షన్ కు వేసుకున్నా తెలుగు నుంచే 9 కోట్లకు పైగా షేర్ వస్తేనే యుటర్న్ హిట్ గా పరిగణించబడుతుంది. బడ్జెట్ మూవీనే అయినప్పటికీ బాగానే వ్యయం చేసారని తెలిసింది. అందులోనూ థ్రిల్లర్ జానర్ కాబట్టి సహజంగా మాస్ ఆడియన్స్ దీని వైపు చూసే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ఇక సామ్ కు రెండు వైపులా రిస్క్ పొంచి ఉంది. ఇక్కడేమో భర్త నాగ చైతన్య మాస్ అవతారంలో శైలజారెడ్డి అల్లుడిగా జనాల దృష్టిని ఆకర్షిస్తుంటే మరోవైపు తమిళ్ లో శివకార్తికేయన్ సరసన తనే నటించిన సీమరాజా సైతం ఇలాంటి పోటీనే తెచ్చిపెట్టింది. అది ఫక్తు మాస్ మసాలా డ్రామా. సిమ్రాన్ నెగటివ్ పాత్రలో కీర్తి సురేష్ ఒక స్పెషల్ సాంగ్ చేసిన సీమ రాజా కనక స్ట్రాంగ్ గా నిలబడితే యుటర్న్ కష్టపడాల్సి ఉంటుంది. ఇలా సమంతా ఒకేసారి రెండు చేతులతో వేర్వేరు కత్తులు పట్టుకుని బాక్స్ ఆఫీస్ యుద్ధం చేయాల్సి వస్తోంది. మనవైపు సైతం శైలజారెడ్డి అల్లుడు మీద ఉన్నంత ఉత్సాహంగా యుటర్న్ విషయంలో ట్రేడ్ ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ సమీకరణాలు అన్ని దాటుకుని సమంతా కనక 9 కోట్లు దాటించిన చాలు సూపర్ హిట్ ముద్ర పడిపోతుంది. మరి సామ్ వల్ల ఇది అయ్యే పనేనా కాదా అనేది రేపు ఈ సమయానికి తేలిపోతుంది. లెట్ వెయిట్ అండ్ సీ.