Begin typing your search above and press return to search.
అమెరికాలో అల్లుడు డీలా సామ్ దే హవా!
By: Tupaki Desk | 18 Sep 2018 10:42 AM GMTఅక్కినేని జంట రెండు సినిమాలతో తమ లక్కును టెస్ట్ చేసుకునేందుకు వినాయక చవితి నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చైతు సినిమా 'శైలజారెడ్డి అల్లుడు' కు టాక్ గొప్పగా లేదుగానీ పండగ సీజన్ .. వీకెండ్ ను ఫుల్ గా ఉపయోగించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు చేసింది. ఇక 'U టర్న్' థ్రిల్లర్ కావడంతో స్లోగా స్టార్ట్ అయింది గానీ పాజిటివ్ టాక్ తో నెమ్మదిగా పుంజుకుంది.
ఓవర్సీస్ కలెక్షన్స్ సంగతి తీసుకుంటే చైతు సినిమా స్టార్ట్ మాత్రం అదిరిపోయిందిగానీ తర్వాత డల్లయిపోయింది. 'శైలజారెడ్డి అల్లుడు' ప్రీమియర్లతో లక్ష డాలర్లకుపైగా కలెక్షన్స్ నమోదు చేస్తే 'U టర్న్' మాత్రం పదివేల డాలర్లతో సరిపెట్టుకుంది. కానీ ఆ తర్వాత చైతు సినిమా కలెక్షన్స్ స్లో కాగా 'U టర్న్' మాత్రం శుక్రవారం నుండి వరసగా $28K.. $48K ..$82K. $43K కలెక్షన్స్ వసూలు చేసింది. శని - ఆదివారాల్లో చైతు సినిమా కంటే 'U టర్న్' కలెక్షన్స్ ఎక్కువగా ఉండడం విశేషం.
'U టర్న్' ఇప్పటివరకూ 2.2 లక్షల డాలర్ల మార్కును దాటింది. ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి వచ్చాడట. ఫుల్ రన్ లో ఈ సినిమా 3 లక్షల డాలర్ల మార్క్ దాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు అల్లుడు బ్రేక్ ఈవెన్ కు రావడం అంత సులువు కాదట.