Begin typing your search above and press return to search.

చైతూతో వార్‌ కు జెండా ఊపిన సమంత!

By:  Tupaki Desk   |   28 Aug 2018 10:10 AM GMT
చైతూతో వార్‌ కు జెండా ఊపిన సమంత!
X
నాగచైతన్య ‘శైలజ రెడ్డి అల్లుడు’ మంచి విడుదల తేదీని చేజార్చుకుని ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లుగా అనిపిస్తుంది. చిత్రం విడుదల తేదీ విషయంలో నాగచైతన్యను ఇంత పెద్ద చిక్కుల్లో పడ్డాడు. అవును ప్రస్తుతం నాగచైతన్య శైలజ రెడ్డి అల్లుడు చిత్రం కారణంగా చాలా పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. ఆ చిత్రం విడుదల తేదీ విషయంలో ఆయన తల బద్దలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒకవైపు నిర్మాతలకు చెప్పుకోలేక, మరో వైపు తన వారితో చర్చించి ఒప్పించలేక ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపిస్తుంది.

ముందుగా అనుకున్న ప్రకారం ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రాన్ని ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సి ఉంది. కాని కేరళలో వరదల కారణంగా రీ రికార్డింగ్‌ పూర్తి కాలేదు. దాంతో సినిమా విడుదల వాయిదా వేయడం జరిగింది. మరో మంచి తేదీని చూసి విడుదల చేద్దాంలే అని ఆ సమయంలో నిర్మాతలు అనుకున్నారు. కాని ఇప్పుడు చిత్రం విడుదలకు సరైన సమయం దొరక్క పోవడంతో తల బాదుకుంటున్నారు. 31న విడుదల కావాల్సిన శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని వచ్చే నెల 7న విడుదల చేయాలని అనుకున్నారు. కాని ఎలాగూ వాయిదా వేశాం కనుక ఒక రెండు బ్యాలన్స్‌ ఉన్న సీన్స్‌ను పూర్తి చేద్దాం అనుకుని 7వ తేదీని వదిలేశారు. ఆ తర్వాత 13 తారీకున వినాయక చవితి శుభాకాంక్షలతో విడుదల చేయాలని భావించారు. అదే రోజున సమంత హీరోయిన్‌గా నటించిన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం ‘యూటర్న్‌’ విడుదల కాబోతుంది. సమంత చిత్ర నిర్మాతలను ఒప్పించవచ్చు అనే ఉద్దేశ్యంతో వినాయక చవితి శుభాకాంక్షలతో అంటూ ప్రచారం చేశారు.

యూటర్న్‌ చిత్రం విడుదల తేదీ విషయంలో నిర్మాతలు వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. దానికి తోడుగా తాజాగా సమంత యూటర్న్‌ చిత్రం కొత్త పోస్టర్‌ ను విడుదల తేదీతో సహా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. సమంత విడుదల తేదీతో పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన కారణంగా ఇక శైలజ రెడ్డి అల్లుడు పరిస్థితి ఏంటో అంటూ ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. చైతూతో సమంత పోటీకి సిద్దం అయ్యి పోస్టర్‌ ను విడుదల చేసిందని కొందరు భావిస్తుండగా, శైలజ రెడ్డి అల్లుడు విడుదల విషయంలో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నట్లుగా మరికొందరు విశ్లేషిస్తున్నారు. 13న యూటర్న్‌ విడుదల అయితే, ఆ తర్వాత వారం అంటే సెప్టెంబర్‌ 20 లేదా 21న శైలజ రెడ్డి అల్లుడు విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. శైలజ రెడ్డి అల్లుడు విడుదల విషయంలో మరో రెండు మూడు రోజుల్లో ఫుల్‌ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యూటర్న్‌ విషయంలో వంద శాతం క్లారిటీ వచ్చేసింది. సమంత యూటర్న్‌ సెప్టెంబర్‌ 13న వినాయక చవితి శుభాకాంక్షలతో రానుంది.