Begin typing your search above and press return to search.
గోదావరి బ్యాక్ డ్రాప్లో సామ్ షికార్లు
By: Tupaki Desk | 19 Feb 2018 8:07 AM GMTతెలుగు-మలయాళి జంటకు మద్రాస్ లో పుట్టిన సమంత.. తమిళియన్ గా పెరిగినా కూడా పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయిపోయింది. అప్పటి నుంచి ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఉండేందుకే ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. అంతే కాదు తన సినిమాలలో తెలుగు పట్టణాల - గ్రామాల బ్యాక్ డ్రాప్ ఉండేలా జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే మళ్లీ రాజమండ్రిలో అడుగుపెట్టినట్టు సమాచారం.
చెర్రీ హీరోగా చేసిన రంగస్థలం సినిమాలో పల్లెటూరి పిల్లలా కనిపించింది సామ్. ఆ సినిమా షూటింగ్ మొత్తం రాజమండ్రి చుట్టుపక్కల చిన్న గ్రామాల్లోనే జరిగింది. అంతా గోదావరి బ్యాక్ డ్రాప్ లోనే సినిమా సాగుతుందంట. ఆమెను చూసేందుకు రోజూ గ్రామస్తులు వచ్చి పోతుండేవారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిపోవడంతో అక్కడ్నించి వచ్చేసింది సమంత. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి యూటర్న్. తానే ఇష్టపడి చేస్తోంది ఆ సినిమా. నిజానికి ఆ మూవీ బెంగళూరు బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. కానీ ఏం పనో కానీ... రాజమండ్రిలో దిగింది సమంత. యూటర్న్‌లో ఏదైనా విలేజ్ సీన్ చేయాలని వచ్చిందో ఏమో మరి.
తెలుగు వారి సినిమా - గ్రామాల నేపధ్యంలో అనగానే... అందరికీ గోదావరి తల్లే గుర్తొస్తోంది. ఆ నది నేపథ్యంలోనే చాలా సినిమాలను నిర్మించారు. నిర్మిస్తున్నారు కూడా. త్వరలో విడుదలయ్యే రంగస్థలమంతా గోదావరే. ఇదిగో ఇప్పుడు సమంత యూటర్న్‌లో కూడా కోనసీమను - గోదావరిని చూపించేద్దామని సిద్దమైనట్టు కనిపిస్తోంది. శేఖర్ కమ్ముల గతంలో గోదావరి అని సినిమా పేరు పెట్టి.... ఆ నదిపైనే సగం సినిమాను నడిపేశాడు. ఇక గోపి... గోపిక... గోదావరి సినిమా మొత్తం గోదారి ఒడ్డునే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో గోదారి కనిపిస్తుంది. రంగస్థలం విడుదలైతే గోదావరి క్రేజ్ మరింత పెరిగిపోతుందేమో.