Begin typing your search above and press return to search.

V.D మ్యాన్లీ లుక్ తో బ‌ర్త్ డే ట్రీట్ మొద‌లైంది!

By:  Tupaki Desk   |   8 May 2022 3:44 PM GMT
V.D మ్యాన్లీ లుక్ తో బ‌ర్త్ డే ట్రీట్ మొద‌లైంది!
X
యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌ర్త్ డే ట్రీట్ మొద‌లైపోయింది. సెల‌బ్రేష‌న్స్ కి ఇంకా కొన్ని గంట‌లు స‌మ‌యం ఉండ‌గానే `లైగ‌ర్`..`జ‌న‌గ‌ణ‌మ‌న` టీమ్ ట్రీట్ షురూ చేసింది. విజ‌య్ న్యూ లుక్ ని రివీల్ చేసి విషెస్ తెలియ‌జేసారు. `లైగ‌ర్` చిత్రం పాన్ ఇండియా కేట‌గిరిలో రిలీజ్ అవుతోన్న నేప‌థ్యంలో అదే రేంజ్ లో విష్ చేసారు.

పోస్ట‌ర్ పై తెలుగు..త‌మిళ్.. క‌న్న‌డం.. హిందీ..మ‌ల‌యాళం భాష‌ల్లో జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అని అచ్చేసారు. ఇక పోస్ట‌ర్ లో విజ‌య్ మ్యాన్లీ లుక్ అదిరిపోయింది. సుప్రీమ్ క‌మాండర్ గా చైర్ లో కూర్చుని విజ‌య్ సీరియ‌స్ గా చూస్తున్న‌ట్లు పోస్ట‌ర్ లో రివీల్ చేసారు. పోస్ట‌ర్ బ్యాక్ గ్రౌండ్ లో విజ‌య్ రోల్ లో వేరిష‌న్స్ హైలైట్ చేసారు. డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో విజ‌య‌ల్ ని చూపిస్తున్నారు.

ఇక స‌మంత విజ‌య్ కి ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. త‌న ట్విట‌ర్ ఖాతాలో వీడీ మ్యాన్లీ లుక్ పోస్ట‌ర్ ని షేర్ చేసి విషెస్ చెప్పింది. విజ‌య్ కి జంట‌గా స‌మంత శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో విజ‌య్ కి ముందొస్తుగా విషెస్ చెప్పింది. ఇక బ‌ర్డ్ డే బోయ్ నైట్ కి గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసే ఉంటాడు.

`లైగ‌ర్`..`జేజీఎమ్` టీమ్ ని పార్టీలో ముంచేయ‌డం ఖాయం. అస‌లే తెలంగాణ హీరో. పార్టీ క‌ల్చ‌ర్ గ‌ల ప్రాంతం. ఇలాంటి బ‌ర్డ్ డేలు వ‌స్తే అస్స‌లు క్ష‌మించారు. ఉన్న‌ స‌మ‌యాన్ని చిల్ అంటారు. ఈ రోజు అర్ధ‌రాత్రి 12 గంట‌ల నుంచి బ‌ర్త్ డే విషెస్ జోరు సోష‌ల్ మీడియా వేదిక‌గా మొద‌ల‌వుతుంది. సెల‌బ్రిటీలు..అభిమానులు..ప్ర‌ముఖుల విషెస్ తో ఖాతాల‌న్ని వేడెక్కిపోవ‌డం ఖాయం.

ఇక విజ‌య్ న‌టించిన `లైగ‌ర్` ఆగ‌స్టులో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రానికి పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అలాగే ఇదే ద‌ర్శ‌కుడితో `జ‌న‌గ‌ణ‌మ‌న` సినిమా కూడా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇలా ఒకేసారి బ్యాక్ టూ బ్యాక్ పూరితో న‌టించ‌డంతో విజ‌య్ పేరు మారుమ్రోగిపోతుంది.