Begin typing your search above and press return to search.

సమంత నోట బ్రహ్మోత్సవం డైలాగ్

By:  Tupaki Desk   |   29 Aug 2016 12:40 PM IST
సమంత నోట బ్రహ్మోత్సవం డైలాగ్
X
ఓ మంచి మాట అనుకుందాం అంటూ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో ఓ పాట ఉంటుంది కదా. ప్రస్తుతం సమంత ఆ పాటే పాడుతోంది. తన గురించి వచ్చే రూమర్ల గురించి తెగ ఫీలైపోతూ ఎప్పుడూ ఎందుకు చెడు మాట్లాడతారు.. నాలుగు మంచి మాటలు మాట్లాడొచ్చు కదా.. పాజిటివ్ గా ఉండొచ్చు కదా అని క్లాస్ పీకుతోంది సమంత.

తన గురించి చాలా గాసిప్స్ ప్రచారం చేస్తున్నారని.. అవి తన వ్యక్తిగత జీవితాన్ని వివాదాస్పదంగా మారుస్తున్నాయని.. ఇది తనను చాలా బాధిస్తోందని సమంత చెప్పింది. చర్చించడానికి దేశంలో చాలా మంచి విషయాలున్నాయని.. కొందరు పనికట్టుకుని ఎగతాళి చేస్తున్నారని.. తనపై విమర్శలు గుప్పిస్తున్నారని.. ఇలాంటివి ఎంత మాత్రం మంచిది కాదని సమంత హితవు పలికింది.

ఈ సందర్భంగానే ఆమె ‘బ్రహ్మోత్సవం’ డైలాగ్ ను గుర్తు చేసింది. ఆ సినిమాలో అన్నట్లు మంచి విషయాల గురించి ఎన్నిసార్లు అయినా మాట్లాడొచ్చని.. చెడు గురించే చర్చించాల్సిన అవసరం లేదని సమంత అంది. మంచి విషయాల గురించి చర్చిస్తే మంచి మంచి ఆలోచనలు వస్తాయని.. అవి ఆరోగ్యానికి మంచిదని.. మంచి విషయాల గురించే చర్చించేలా ఎవరికి వారు ప్రమాణం చేసుకోవాలని సమంత పిలుపు ఇవ్వడం విశేషం. అయినా సినిమా తారలన్నాక రూమర్లు.. కామెంట్లు కామన్. సమంతకూ ఇలాంటివి మొదట్నుంచి అలవాటే. మరి కొత్తగా ఇంతగా ఫీలైపోయి.. ఇలా క్లాసులు పీకేస్తోందేంటో?