Begin typing your search above and press return to search.

మాట మీద నిలబడ్డ సామ్

By:  Tupaki Desk   |   8 Jun 2018 11:24 AM GMT
మాట మీద నిలబడ్డ సామ్
X
అక్కినేని కోడలయ్యాక సమంతా స్పీడ్ ఇంకా పెరిగింది. ఒకదాని మించి ఒకటి బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. రంగస్థలం టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవగా కీలక పాత్ర చేసిన మహానటి మరపురాని చిత్రంగా మిగిలిపోయింది. మరోవైపు విశాల్ తో చేసిన ఇరుంబుతిరై(అభిమన్యుడు)అతని కెరీర్ లోనే టాప్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. విశేషం ఏంటంటే ఎప్పుడు విడులయ్యాయి అనేదానితో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూడూ రన్ అవుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున హ్యాండ్ లూమ్ అంబాసడర్ గా ఉన్న సమంతా అభిమన్యుడు సినిమాలో అన్ని అవే చీరలు కట్టడం ద్వారా తను ప్రమోట్ చేస్తున్న కాన్సెప్ట్ కు కట్టుబడినట్టు అయ్యింది. చాలా సింపుల్ గా సాదాగా అనిపించినా గ్లామర్ కి లోటు లేకుండా చేనేత చీరలో అందాన్ని చూపించే విధంగా సామ్ కట్టుకున్న తీరు నిజంగానే ముచ్చటగొలిపింది.

ఊరికే మాట వరసకు చెప్పడం కాకుండా తను నటించే సినిమాల్లో కూడా చేనేత వస్త్రాలు ధరించి సమంతా ఆదర్శంగా నిలుస్తోందని ఫాన్స్ సంబరపడుతున్నారు. ప్రస్తుతం కన్నడ రీమేక్ యు టర్న్ లో నటిస్తున్న సమంతా శివకార్తికేయన్ సరసన తమిళ్ లో సీమ రాజా లో కూడా చేస్తోంది. ఈ రెండూ షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. సామ్ స్పీడ్ చూస్తుంటే ఈ ఏడాది ఎక్కువ సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ గానే కాక పెళ్ళైనా ఆఫర్స్ తగ్గని మరో అరుదైన రికార్డు సొంతం చేసుకోనుంది. అప్పట్లో సావిత్రి గారి తర్వాత పెళ్లి జరిగాక కూడా హీరోయిన్ పాత్రలు దక్కించుకున్న వాళ్ళు చాలా అరుదు. ఉన్నా ఒకటో రెండో చేసిన వాళ్లే తప్ప వరసగా సూపర్ హిట్స్ అందుకున్న వారు అయితే లేరు. ఈ రకంగా చేనేత వస్త్రాలకు స్ఫూర్తిగా ఉండటంతో పాటు సక్సెస్ ట్రాక్ అలాగే కొనసాగిస్తున్న సమంతా చైతుతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించే సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుంది.