Begin typing your search above and press return to search.
'యూట్యూబ్ ఛానళ్లలో సమంత వీడియోలు తొలగించాల్సిందే'
By: Tupaki Desk | 26 Oct 2021 3:32 AM GMTస్టార్ హీరోయిన్ సమంత ఇటీవల మూడు యూట్యూబ్ ఛానళ్ల మీద పరువునష్టం దావా కేసు వేసిన సంగతి తెలిసిందే. తన పరువుకు నష్టం కలిగించే విధంగా వ్యక్తిగత విషయాలపై సదరు యూట్యూబ్ ఛానళ్లు అభ్యంతరకర వార్తలు రాశాయని గత బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమంత వేసిన పరువునష్టం దావా కేసు విచారణ హైదరాబాద్ లోని కూకట్ పల్లి న్యాయస్థానంలో జరుగుతోంది.
సమంత తరపు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్ పరువుకు నష్టం కలిగించేలా, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సదరు యూట్యూబ్ ఛానళ్లు వ్యవహరించాయని పేర్కొన్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులున్నాయని.. సమంత - నాగచైతన్యకు విడాకులు మంజూరు కాకముందే వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
తన క్లయింట్ వ్యక్తిగత, వృత్తిపర జీవితానికి సదరు యూట్యూబ్ ఛానళ్లు ఇబ్బంది కలిగించాయని.., తక్షణమే ఈ కేసును విచారించాలని కోర్టుకు నివేధించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కేసును విచారణకు స్వీకరించి ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సమంత దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం మరోసారి వాదనలు జరిగాయి.
సమంత ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని న్యాయవాది బాలాజీ న్యాయస్థానాన్ని కోరారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న మహిళపై ఇలా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రసారాలు చేయడం సరైంది కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. యూట్యూబ్ లో వీడియో లింకులు మాత్రమే తొలగించాలని కోరుతున్నామని.. భవిష్యత్ లో ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.
గతంలో నటి శిల్పా శెట్టి కేసులో ముంబై హైకోర్టు ఇదే తరహాలో ఇంజెంక్షన్ ఆర్డర్ ఇచ్చిందని ఈ సందర్భంగా సమంత తరపు న్యాయవాది ఉదహరించారు. ఈరోజు వాదనలు విన్న కూకట్ పల్లి న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తూ, తీర్పును రేపటికి వాయిదా వేసింది.
కాగా, అక్కినేని నాగచైతన్య - సమంత జంట నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ, విడిపోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. వీరి విడాకులకు కారణాలు ఇవేనంటూ అనేక ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సామ్ గురించి కొన్ని వార్తలు ప్రసారం చేశాయి. ఈ కథనాలు తన పరువుకు నష్టం కలిగిస్తున్నాయని.. వ్యక్తిగత జీవితంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సమంత కోర్టుకు వెళ్ళింది. న్యాయస్థానం ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.