Begin typing your search above and press return to search.
కమిట్మెంట్ అంటే సమంతదేనబ్బా
By: Tupaki Desk | 11 March 2017 2:19 PM GMTసౌత్ బ్యూటీ సమంత సినిమాలను ఎంత కమిట్మెంట్ తో చేస్తుందో.. స్వచ్ఛంద సేవలోనూ అంతే సిన్సియారిటీ చూపిస్తుంది. ఓ సినిమాను ఒప్పుకుందంటే.. షూటింగ్ పూర్తయ్యాక పబ్లిసిటీ యాక్టివిటీస్ లో సమంత అంత యాక్టివ్ గా పాల్గొనే హీరోయిన్ మరొకరు ఉండరు. అలాగే తన మనసుకు నచ్చిన పనులు చేయడంలోనూ బాగా డెడికేట్ అయిపోతూ ఉంటుంది సమంత.
కొన్ని వారాల క్రితం శామ్ ను తెలంగాణ ప్రభుత్వం చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఏ స్టార్ కి అయినా ఇస్తే.. ఆయా ప్రభుత్వాలు ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే.. మొక్కుబాటుగా పాల్గొని.. రెండు ముక్కలు చెప్పేసి.. ఇరవై ఫోటోలు దిగడం తప్ప చాలామంది వేరే ఏదీ చేయరు. అందరిలానే ఉంటే తనకు మిగతా వాళ్లకు తేడా ఏంటి అనుకుందో.. లేక చేనేత కార్మికుల కష్టాలు ఈమెను కదిలించేశాయో చెప్పలేం కానీ.. ఇప్పుడు హ్యాండ్ లూమ్స్ విషయంలో బాగా డీప్ గా వెళ్లిపోతోంది. తాజాగా మెదక్ జిల్లా దుబ్బాక వెళ్లిపోయి అక్కడి వారిని పలకరించి పరామర్శించింది కూడా.
అంతే కాదు.. చేనేత వస్త్రాలకు ప్రమోషన్ చేసేందుకు తాను ఎంత చేయగలనో అంతా చేస్తానని చెప్పిన శామ్.. ప్రభుత్వమే నేరుగా వీటిని కొనే అవకాశం పరిశీలించాలని.. సర్కారును కోరతానని కూడా చెప్పేసింది. సమంతకు ఈ బాధ్యతలు అప్పగించడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం సరైనదే అనిపించేస్తోంది కదూ!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/