Begin typing your search above and press return to search.
ఓపిక నశిస్తోంది, వేచి చూడలేకపోతున్నా
By: Tupaki Desk | 28 July 2015 2:14 PM GMTసమంత ప్రస్తుతం ఏం చేస్తోంది? ఏ షూటింగులో పాల్గొంటోంది? హైదరాబాద్ లో సందడే చేయదేం? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేసింది. అందాల సమంత ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో ఉండడం లేదు. ఈ భామ చెన్నయ్ లో ఉంటూ అట్నుంచి అటే తమిళ సినిమాల షూటింగుల్లో బిజీబిజీ గా తిరుగుతోంది. ప్రస్తుతం విజయ్ సరసన ఆడిపాడుతోంది.
బన్ని సరసన నటించిన సన్నాఫ్ సత్యమూర్తి ఈ వేసవిలో రిలీజై సైలెంట్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఈ భామ నటించిన సినిమా ఏదీ రాలేదేం? అని తెలుగు అభిమానులు బెంగ పెట్టేసుకున్నారు. అయితే ఆ బెంగ తీర్చే మందు ఇప్పట్లో దొరికేట్టు కనిపించడం లేదు. ఎందుకంటే సమంత ప్రస్తుతం విజయ్ సరసన 'విజయ్ 59' అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి రాజా రాణి ఫేం అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విజయ్ పై భారీ యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కించారు. దాంతో పాటే విజయ్, సమంత, రాధిక తదితరులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. నిన్నటితో తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తవుతుంది.
అంతేకాదు తమిళ స్టార్ హీరోలు విక్రమ్, సూర్య, సరసన వరుసగా సినిమాలు చేస్తోంది. ఇవన్నీ రావడానికి ఇంకా టైమ్ పడుతుంది. ఇక తెలుగులో బ్రహ్మూత్సవం త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనుంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజవుతుంది. అంటే సమంత నటించిన ఓ సినిమా రిలీజ్ కావడానికి చాలా కాలమే వేచి చూడాల్సిందే. అందేకేనేమో అస్సలు వేచి చూడలేకపోతున్నా. ఓపిక నశించింది అంటూ సమంత అసహనం వెల్లగక్కుతోంది.