Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ : చేనేత చీరలో రామలక్ష్మి
By: Tupaki Desk | 24 March 2018 10:03 AM GMTనాగచైతన్యని పెళ్లిచేసుకుని, అక్కినేని వారి కోడలిగా మారిన తర్వాత కూడా సమంత హవా ఏ మాత్రం తగ్గట్లేదు. వరుస సినిమాలు చేస్తూనే, అవసరమైన ఇన్‌స్టాలో హాట్ హాట్ ఫోటోలతో దర్శనమిస్తోంది. తాజాగా అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నిండుగా చేనేత చీర చుట్టుకుని ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది. నడుము అందాలు కూడా కనిపించకుండా పూర్తిగా కప్పేసినా, తన కళ్లతోనే మత్తుమందు జల్లుతోందీ రామలచ్చిమి.
తెలంగాణ చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన సమంతా అక్కినేని, చేనేత ఉత్పత్తులను ప్రచారం చేసేందుకు సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తోంది. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఏప్రిల్ 7, 8 తేదీలలో చెన్నైలోని మై ఫార్‌చ్యూన్ హోటెల్‌లో జరగబోతున్న చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్లో ఈ చీరలు దొరకుతాయంటూ పోస్ట్ చేసింది సమంత. ‘రంగస్థలం’ సినిమాలో ‘ఎంత సక్కగున్నావే’ పాట ప్రొమో నిన్ననే విడుదలయింది. ఈ పాటలో సమంత పల్లెటూరి అందాలను పైట కొట్టులో చుట్టుకున్న పదహారణాల పడుచులా ఒదిగిపోయింది సమంత. మార్చి 30న విడుదలవుతున్న ‘రంగస్థలం’ సినిమాలో ఇంకెంత బాగుంటుందో అని ఆమె అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా శ్రీవారు నాగచైతన్యతో కలిసి ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది సమంత. ‘నిన్నుకోరి’ ఫేం శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి ‘ప్రేయసి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు.