Begin typing your search above and press return to search.

సమంతను అఖిల్ వదినా అన్న వేళ..

By:  Tupaki Desk   |   17 March 2017 6:02 AM GMT
సమంతను అఖిల్ వదినా అన్న వేళ..
X
అవును.. అక్కినేని అఖిల్ సమంతను వదినా అని సంబోధించాడు. వ్యక్తిగతంగా అఖిల్.. ఇప్పటికే సమంతను అలా పిలుస్తూ ఉండొచ్చు కానీ.. పబ్లిగ్గా అయితే అలా పిలిచింది లేదు. ఐతే ట్విట్టర్లో సమంతను వదినా అని సంబోధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు అఖిల్. అక్కినేని కుర్రాడు ట్విట్టర్లో 1 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఈ సందర్భంగా చాలా ఎగ్జైట్ అవుతూ తన ఫాలోవర్లకు థ్యాంక్స్ చెప్పాడు. వీళ్లందరూ ఫాలోవర్లు కాదని.. తన బిలీవర్స్ అని పేర్కొన్నాడు అఖిల్. వీళ్లందరూ తనను ప్రోత్సహిస్తూ.. మద్దతుగా నిలుస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని అన్నాడు.

అతనీ ట్వీట్ పెట్టాక సమంత స్పందించింది. ‘ఐయామ్ ఎ బిలీవర్’ అని ట్వీట్ చేసింది. దీనికి బదులుగా ‘థ్యాంక్ యు వదినా’ అని ట్వీట్ చేశాడు అఖిల్. హీరోగా అఖిల్ చేసింది ఒకే సినిమా. అది కూడా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ 1 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకోవడం విశేషమే. టాలీవుడ్ హీరోల్లో చాలా తక్కువమంది మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. హీరో కాకముందే అఖిల్ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో ఏ అరంగేట్ర హీరోకూ రానంత హైప్ వచ్చింది అఖిల్ కు. కానీ ఆ హైప్ ను అతను నిలబెట్టుకోలేకపోయాడు. ‘అఖిల్’ సినిమాతో దెబ్బ తిన్నాడు. ఈ సినిమా తర్వాత బాగా గ్యాప్ తీసుకుని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన రెండో సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు అఖిల్. ఈ చిత్రం ఏప్రిల్ తొలి వారంలో సెట్స్ మీదికి వెళ్లనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/