Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చైతూ - సామ్ మ‌ధ్య చేరి స‌తాయిస్తున్న వీడెవ‌డు?

By:  Tupaki Desk   |   30 March 2020 4:46 AM GMT
ఫోటో స్టోరి: చైతూ - సామ్ మ‌ధ్య చేరి స‌తాయిస్తున్న వీడెవ‌డు?
X
అక్కినేని కోడ‌లు స‌మంత సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. రెగ్యుల‌ర్ గా ఏదో ఒక స్పెష‌ల్ అప్ డేట్ తో ట‌చ్ లో ఉండ‌డం త‌న ప్ర‌త్యేక‌త‌. గ‌త కొంత కాలంగా భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో హోమ్ క్వారంటైన్ లో నిర్భంధంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే చైతూకి ఇష్ట‌మైన వంట‌కాల్ని వండి పెడుతూ ఇళ్లంతా శుభ్ర‌ప‌రుచుకుంటూ ఒక సాధార‌ణ గృహిణిలా సేవ‌లు చేస్తోంది. ఇన్నాళ్లు బిజీ షెడ్యూళ్లు సినిమాలు అంటూ హ‌డావుడి హ‌డావుడిగా తిరిగేసిన స‌మంత‌కు క‌రోనా ఈ ర‌కంగా పెద్ద సాయం అవుతోంది.

హ‌బ్బీ చైత‌న్య‌తో పాటే వేకువ ఝాము నుంచి నిదురించే వ‌ర‌కూ స‌మ‌యం స్పెండ్ చేస్తోంది. ఒక‌ర‌కంగా ఇలాంటి అరుదైన అవ‌కాశాన్ని ఏమాత్రం మిస్ చేసుకోకుండా సామ్ బాగానే స‌ద్వినియోగం చేసుకుంటోంది. ఇక ఇన్నాళ్లు మీడియా నుంచి నెటిజ‌నుల నుంచి ఎదురైన అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చేసేందుకు ప్రిప‌రేష‌న్ లోనే ఉందిట‌. అయితే చైతూ - సామ్ ల మ‌ధ్య ఓ అతిథి మాత్రం బాగా న‌స పెట్టేస్తున్నాడు. అతిథి అంటే సామ్ ఫీల‌వుతుందేమో.. అతిథి కాదు సొంత మ‌నిషి.. కుటుంబీకుడు అంటేనే ఊరుకుంటుంది. లేదంటే క‌చ్ఛితంగా సామ్ చిన్న బుచ్చుకోవ‌డం ఖాయం.

ఆ ఫ్యామిలీ మ్యాన్ ఎవరో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. స‌మంత - చైత‌న్య జంట మ‌ధ్య ప్ర‌వేశించిన ఫ్యామిలీ మ్యాన్ 2 పేరు య‌ష్ అక్కినేని. ముద్దొచ్చే పెట్ డాగ్ ఇది. అయినా తన సొంత త‌మ్ముడి కంటే ఎక్కువ‌గా చూసుకోవ‌డం చైత‌న్య‌కు అల‌వాటు.. మ‌రిదిలా ఒక కొడుకు లాగా చూసుకోవ‌డం సామ్ కి అల‌వాటు. ఇదిగో ఇక్క‌డ స‌న్నివేశం చూస్తుంటే మీకే అర్థ‌మ‌వుతుందిగా.. క్యూట్ గా చ‌బ్బీగా ఎంతో ముద్దొస్తున్న అక్కినేని య‌ష్ చిద్విలాసం చూస్తుంటే ఎవ‌రికైనా ఈర్ష్య‌గానే ఉంటుంది మ‌రి. అన్న‌ట్టు అన్న వ‌దినల్ని అనుస‌రిస్తూ చిట్ట‌బ్బాయ్ య‌ష్ కూడా ఇలా నిర్భంధంలో ఉన్నాడు పాపం!!