Begin typing your search above and press return to search.
సత్తా చూపేందుకే సమంత ప్రకటనలు?
By: Tupaki Desk | 16 Oct 2021 5:45 AM GMTఅక్కినేని నాగచైతన్య నుంచి సమంత విడిపోతున్నట్టు ప్రకటించగానే అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రకటన అనంతరం టాలీవుడ్ లో సామ్ కెరీర్ ఇక ముగిసినట్టేనని బాలీవుడ్ కి వెళ్లిపోతుందని అలాగే హిందీ వెబ్ సిరీస్ లకు అంకితమవుతుందని రకరకాల పుకార్లు షికార్ చేశాయి. కానీ వాటన్నిటినీ సమంత కొట్టి పారేశారు. తన ఇల్లు హైదరాబాద్ లో మాత్రమే ఉంటుందని తెలిపారు. అలాగే తన కెరీర్ ఇకపైనా ఇక్కడే కొనసాగుతుందని వెల్లడించారు.
తాను చెప్పినట్టే ఇప్పుడు ఒకదాని వెంట ఒకటిగా సమంత పేరుతో రెండు ప్రాజెక్టులను దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇవి ద్విభాషా చిత్రాలుగా తెరకెక్కనున్నాయి. దసరా రోజున డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సమంతతో ద్విభాషా చిత్రం చేస్తున్నామని ప్రకటించగా.. ఆ తర్వాత శ్రీదేవి మూవీస్ సంస్థ కూడా సమంతతో తమ సినిమాని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకి హరి - హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తారు.
సమంత ముఖ చిత్రంతో ప్రకటించారు కాబట్టి ఇవి రెండూ లేడీ ఓరియెంటెడ్ కథాంశాలతో రూపొందనున్నాయని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా కథాంశాలు ఏ తరహాలో ఉంటాయో అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఈ రెండు ప్రకటనలలో సమంత మాత్రమే హైలైట్. కథానాయకులు ఎవరు? లేదా ఇతర సహాయక నటుల గురించి ఎలాంటి వివరాలు బహిరంగపరచబడలేదు. దక్షిణ భారతదేశంలో సమంత తన స్టార్ డమ్ ఏమాత్రం తగ్గదని నిరూపించడమే ధ్యేయంగా ఈ ప్రకటనలు వెలువడ్డాయని అంతా భావిస్తున్నారు. ఓబేబి తరహా నాయికా ప్రధాన కథాంశాల్లో నటించేందుకు సమంత ఆసక్తిగా ఉంది. అలాగే టాలీవుడ్ లో ఇతర స్టార్ హీరోల సరసన నటించేందుకు సిద్ధంగా ఉందని కథనాలొస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోల పోస్టర్ ప్రకటనలకు ధీటుగా సమంతను నిర్మాతలు ప్రమోట్ చేస్తుండడం ఆసక్తికరం.
ఇక సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటాలంటే బలమైన కథాంశాల్లో నటించాల్సి ఉంటుంది. అనుష్క అరుంధతి-భాగమతిలా.. సౌందర్య అమ్మోరు లా.. కథాబలం ఉన్న సినిమాల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఓ బేబి తరహాలో ప్రయోగాలకు శ్రీకారం చుట్టాల్సి ఉంటుంది. మునుముందు సామ్ ప్లానింగ్ ఏ తీరుగా సాగనుందో వేచి చూడాలి.
బ్రాండ్ల సన్నివేశమేంటో కానీ..!
అంతా బావుంటే ఓకే. డిఫరెన్సెస్ వస్తేనే సమస్య. నాగచైతన్యతో సమంత డిఫరెన్సెస్ అటుపై విడాకుల నిర్ణయం కొన్ని బ్రాండ్లకు ఇబ్బందికరంగా మారిందని కథనాలొచ్చాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ తరహా చిక్కులను ఎదుర్కొంటోంది.
విడాకుల ప్రకటన అనంతరం సమంత మీడియా గ్లేర్ కి దూరంగా ఉన్నారు. ఇంకొంతకాలం ఇదే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ప్రముఖ OTT ప్లాట్ ఫాం డిస్నీ+ హాట్ స్టార్ ఆందోళన చెందుతోందని ప్రచారమైంది. సమంత తదుపరి తమిళ చిత్రం కాతు వాకుల రెండు కాదల్ డైరెక్ట్-టు- OTT హక్కులను డిస్నీ+ హాట్‌స్టార్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి- నయనతార తోపాటు సమంత నటించారు. సాధారణంగా నయనతార తన సినిమాను ప్రమోట్ చేయదు. అయితే హాట్ స్టార్ సినిమాను దూకుడుగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ సమంత మీడియాకు దూరంగా ఉండాలని భావిస్తే.. విజయ్ సేతుపతితో సరిపెట్టుకోవాలి. విజయ్ సేతుపతి వంటి బిజీ స్టార్ ఖచ్చితంగా ప్రమోషన్ ల కోసం ఎక్కువ సమయం కేటాయించలేరు. ఇది సదరు ఓటీటీకి ఇబ్బందికర సన్నివేశమని విశ్లేషిస్తున్నారు.
ది ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదం నుంచి బయటపడాలంటే తమిళంలో ప్రమోషన్స్ లో వేగం పెంచాలని సమంత భావించారు. కానీ విడాకుల అనంతరం సన్నివేశం మారింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన - కాథు వాకుల రెండు కాదల్. ఈ సినిమాలో సమంత- నయనతార సోదరీమణులుగా కనిపిస్తారని పుకార్లు వచ్చాయి. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. సమంత విడాకుల నిర్ణయం ఇప్పుడు ప్రచారం పరంగా ప్రతిదీ మార్చేసింది. డైలమాల్ని క్రియేట్ చేసింది.