Begin typing your search above and press return to search.
సమంత.. ఆ బాబు.. ఒక ఫొటో
By: Tupaki Desk | 14 May 2016 11:50 AM GMTసమంతలో చిన్నారుల్ని వశపరుచుకునే ఆకర్షణ మంత్రమేదైనా ఉందో ఏమో తెలియదు కానీ.. ఆమెను చూడగానే స్టార్ కిడ్స్ అందరూ ఐస్ అయిపోతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు కూతురు సితార సమంతకు ఎంత మంచి ఫ్రెండ్ అయిపోయిందో బ్రహ్మోత్సవం సెట్లో.. ఆ సినిమా ఆడియో ఫంక్షన్లో తీసిన ఫొటోలతో బాగానే అర్థమైంది. ఆ తర్వాత ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ లో ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ ను సైతం ఎంత బాగా ముద్దు చేసి అతణ్ని దగ్గరికి తీసుకుందో అందరికీ అర్థమైంది. ఇక సమంతకు చాలా చాలా క్లోజ్ అయిన ఇంకో బాబు ఇండస్ట్రీలో ఉన్నాడు. అతనే అన్ష్.
సమంత పర్సనల్ స్టైలిస్ట్, కోన వెంకట్ సోదరి నీరజ కోన కొడుకే ఈ అన్ష్. గత ఏడాదే పుట్టిన ఈ బాబుతో సమంతకు చాలా మంచి అనుబంధముంది. చెన్నైలోని తన కుటుంబానికి దూరంగా హైదరాబాద్ లో ఉంటున్న సమంత.. సాయంత్రం షూటింగ్ నుంచి సెలవు తీసుకోగానే నీరజ ఇంట్లో వాలిపోయి ఈ బాబుతోనే ఆడుకుంటూ ఉంటుంది. అన్ష్ కు సమంత రెండో తల్లి అంటూ ఉంటుంది నీరజ. తరచుగా వీళ్లిద్దరి అనుబంధాన్నిచాటే ఫొటోల్ని షేర్ చేస్తుంటుంది. అలా షేర్ చేసిన తాజా ఫొటో చూస్తే.. సమంత ఆ బిడ్డకు తల్లేమో అన్న ఫీలింగ్ కలిగించేలో సర్ ప్రైజింగ్ గా అనిపించడం ఖాయం.