Begin typing your search above and press return to search.

కోడలు.. అమ్మ.. ప్రేయసి.. 'మనం'

By:  Tupaki Desk   |   6 Jun 2017 7:07 AM GMT
కోడలు.. అమ్మ.. ప్రేయసి.. మనం
X
అక్కినేని హీరోలు చేసిన సినిమాలలో గొప్పగా నిలిచిపోయాన ఒక తెలుగు సినిమా ‘మనం’ అని చెప్పవచ్చు. ఎందుకంటే అందులో అందరూ ఉన్నారు అని కాదు.. కథకు అవసరమైనట్లుగా ఒదిగి నటించారు కాబట్టి. అందులో సమంత ని నాగార్జున అమ్మ అన్నడం, అక్కినేని నాగేశ్వర రావు గారు నటించడం విక్రమ్ కుమార్ దర్శకత్వం.. అన్నీ కలిపి ఒక క్లాసిక్ గా నిలబెట్టింది.

మొన్ననే హైదరాబాద్ లొ IIFA ఉత్సవం జరిగింది. ఈ అవార్డ్ షో లొ అన్నయ్య రానా చేసిన అల్లరికి సమంత బాగానే ఎంజాయ్ చేసింది. ఒక పక్కన మామ నాగార్జున కూడా వచ్చాడు. మరి అలాంటి ఫంక్షన్ లొ సమంత కూడా తన అదిరే అందంతో ఆకట్టుకునేట్టు వచ్చి ఇలా ప్రేమను పంచింది. అంతేకాదు.. మనంలో తనతో కలిసి హీరోయిన్ గా.. అక్కినేనికి అమ్మగా నటించిన శ్రీయను తన ఒడిలో కూర్చొబెట్టుకొని ప్రేమగా మాట్లాడి పాత స్నేహితురాలును వాటేసుకున్నంత ప్రేమగా తన చేతులతో చుట్టేసింది. పక్కనే అదే సినిమాలో నాగచైతన్య ప్రేయసిగా ఒక చిన్నగెస్ట్ రోల్ చేసిన రాశి ఖన్నా కూడా నవ్వులు విరజిముత్తు మన 'మనం' గాళ్స్ స్పెషల్ గా కనిపించారు.

సమంత తను నటించిన ‘అ ఆ’ సినిమాకు గాను ఉత్తమ నటిగా అవార్డును తీసుకుంది. అక్కినేని కోడలు చేస్తున్న అల్లరి ప్రేమకు తెలుగు అభిమానులు, తెలుగు స్టార్స్ అంతా ఫిధా అవుతున్నారు. ఇకపోతే అక్టోబర్ లో చైతన్యతో తన పెళ్ళి జరుగుతున్న సంగతి తెలిసిందే.​ మరోసారి మనం గాళ్స్ అందరినీ మనం ఆ పెళ్ళిలో కలుసుకునే ఛాన్సుందిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/