Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : మేకప్ లేకుండానే మెస్మరైజ్ చేస్తోంది

By:  Tupaki Desk   |   14 May 2020 6:18 AM GMT
పిక్ టాక్ : మేకప్ లేకుండానే మెస్మరైజ్ చేస్తోంది
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కు పప్పీలపై ఉండే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైతు మరియు సమంతలు తాము ఎక్కడ ఉంటే అక్కడ తమ పప్పీలతో ఆడుతూ కనిపిస్తారు. ప్రస్తుతం వీరు లాక్ డౌన్ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి ఉంటున్నారు. ఈ సమయంలో వీరు తమ పెంపుడు కుక్కలతో ఎక్కువ సమయంను గడుపుతూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా సమంత షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అయ్యింది.

పప్పిని ముందు పెట్టిన సమంత ఆ వెనుక ఉండి ఫొటోకు ఫోజ్ ఇచ్చింది. ఈ ఫొటోలో సమంత ఏ మాత్రం మేకప్ లేకుండా కనిపించింది. ఈ అమ్మడు సింపుల్ గా చాలా స్వీట్ గా ఉంది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ ఫొటోకు లైక్ మరియు కామెంట్స్ వస్తున్నాయి. మేకప్ లేకుండానే సమంత మెస్మరైజ్ చేస్తుంది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. జిడ్డు కారుతున్న ఈ ఫోటోను తాము చూడలేక పోతున్నాం అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సమంత ఈ ఏడాది ఇప్పటి వరకు సినిమాలు ఏవి కన్ఫర్మ్ చేయలేదు. గత ఏడాదిలో రెండు సినిమాలతో సక్సెస్ అందుకుంది. ఈ ఏడాది సమంత సినిమాలు రాకపోవచ్చు. వచ్చే ఏడాదిలో సినిమాను ఈమె తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.