Begin typing your search above and press return to search.
సమంత కష్టంకు ఫిదా అవ్వాల్సిందే
By: Tupaki Desk | 4 Dec 2020 6:51 AM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెగ్యులర్ గా తన వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది. ఆమె కష్టంకు అంతా కూడా అవాక్కవ్వాల్సిందే. అంతగా కష్టపడుతూ బరువులు ఎత్తుతున్న ఈమె మరో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె గ్రాస్ లో చేస్తున్న వర్కౌట్ లను చూడవచ్చు. వీడియోలో ఆమె పెట్ డాగ్ కూడా ఉంది. చాలా క్యూట్‌గా ఉన్న ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సమంత ఫిజికల్ ఫిట్ నెస్ కోసం పడుతున్న కష్టంకు అందరు అబ్బుర పడుతున్నారు.
అందంతో పాటు ఫిజిక్ మరియు స్ట్రెంత్ అనేది చాలా ముఖ్యం. అందుకే సమంత రెగ్యులర్ గా వర్కౌట్ లు చేస్తుంది. మొన్నటి వరకు మాల్దీవులకు వెళ్లి వచ్చిన సమంత కాస్త గ్యాప్ రావడంతో కాస్త ఎక్కువగా కష్టపడుతున్నట్లుగా ఈ వీడియోను చూస్తుంటే అనిపిస్తుంది. సమంత వర్కౌట్ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది జాను తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత వచ్చే ఏడాది ఆరంభంలో 'ది ఫ్యామిలీ మాన్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు ఈమె సామ్ జామ్ టాక్ షో ను కూడా చేస్తోంది. ఆహాలో అది స్ట్రీమింగ్ అవుతుంది.