Begin typing your search above and press return to search.
100కేజీలు ఎత్తి అవతలేసింది!
By: Tupaki Desk | 22 May 2019 5:26 PM GMTఅక్కినేని కోడలు సమంత ఫిట్ నెస్ సీక్రెట్ గురించి తెలిసిందే. నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ టోన్డ్ బాడీని ఏమాత్రం చెక్కు చెదరకుండా మెయింటెయిన్ చేస్తోంది. ఓవైపు మామ నాగార్జున యూరప్ అడవుల్లో స్ట్రెచింగ్ బెల్ట్ సాయంతో చెట్టు పుట్ట అనే తేడా లేకుండా 60 వయసులో అంత కష్టపడుతుంటే.. అందుకు పోటీనా అన్నట్టుగా సామ్ జిమ్ముల్లో డబుల్ ట్రిపుల్ వర్కవుట్లు చేస్తోంది. మామతో కలిసి ప్రస్తుతం `మన్మధుడు 2`లో నటిస్తున్న సామ్ జిమ్మింగ్ ని చాలానే సీరియస్ గా తీసుకుందని అర్థమవుతోంది. మామా - కోడళ్లు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారా? అనిపిస్తోంది.
తాజాగా సమంత ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసిన ఓ ఫోటో చూశాక అభిమానులు షాక్ కి గురవుతున్నారు. 100 కేజీల బరువైన ఐరన్ డ్రమ్స్ ని అవలీలగా ఎత్తి అవతల పడేస్తోంది సామ్. అంత బరువును భుజాలపై మోస్తూ ఎదుటివారికి చెమటలు పట్టిస్తోంది. బైసెప్ ట్రైసెప్ గిరగిరా తిప్పేస్తూ 6 ప్యాకింగులు చేసే పురుషపుంగవులకే ఇదో సవాల్ లాంటిది. సామ్ కఠోర తపస్సు ఏ రేంజులో ఉంటుందో చెప్పుకునేందుకు ఇదో శాంపిల్ మాత్రమే.
సమంత వర్కవుట్లు చూశాక.. తనపై కాంప్లిమెంట్లు కురుస్తున్నాయి. `బీస్ట్` అంటూ ఒకరు.. `పవర్ ఉమెన్` అంటూ ఇంకొకరు.. `న్యూ ఐరన్ లేడీ` అంటూ వేరొకరు కాంప్లిమెంట్లు ఇచ్చారు. నిజమే.. ఈ వర్కవుట్లు చూస్తుంటే ఐరన్ లేడీ అని బీస్ట్ అని అంగీకరించాల్సిందే. నిరంతర ఫిట్ నెస్ ఫ్రీక్ గా కనిపించిన జిమ్ములన్నీ విరిచేస్తోంది. అన్నట్టు సామ్ తో పోలిస్తే నాగచైతన్యనే కాస్తంత సెన్సిటివ్ అని అర్థమవుతోంది. జిమ్ లో ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పెట్టుకుంటే ష్యూర్ షాట్ గా సామ్ నే గెలిచేట్టుంది!!