Begin typing your search above and press return to search.

సమంత మరో సినిమా విడుదల వాయిదా

By:  Tupaki Desk   |   11 July 2022 8:30 AM GMT
సమంత మరో సినిమా విడుదల వాయిదా
X
టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ సమంత ఇప్పటికే శాకుంతలం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. షూటింగ్‌ పూర్తి అయ్యి నెలలు గడుస్తున్నా కూడా శాకుంతలం సినిమా ఇంకా విడుదల తేదీ విషయంలో క్లారిటీ రాలేదు. శాకుంతలం కు ముందు యశోద సినిమా తో సమంత వస్తుందని ఆశించినా కూడా ఆ సినిమా కూడా వాయిదా పడింది.

మొన్నటి వరకు యశోద సినిమా ను ఆగస్టు 12న విడుదల చేయబోతున్నట్లుగా అంతా భావించారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ లో సినిమా పై అంచనాలు ఆసక్తి పెరిగింది. కాని తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

సినిమా షూటింగ్ బ్యాలన్స్ ఉండటంతో పాటు సినిమా ఔట్ పుట్‌ బెటర్ గా రావడం కోసం ఇంకాస్త సమయం తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే సినిమాను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. సినిమా టాకీ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి అయ్యింది.. ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట.

షూటింగ్ ను అతి త్వరలోనే పూర్తి చేసి కొత్త విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. సినిమా లో సమంత పాత్ర పై ఇప్పటికే విడుదల అయిన గ్లిమ్స్ తో ఆసక్తి బాగా పెరిగింది. అంచనాలు భారీగా ఉన్న యశోద సినిమా విడుదల వాయిదా విషయం సమంత అభిమానులకు నిరుత్సాహం ను కలిగిస్తుంది. యశోద మరియు శాకుంతలం సినిమా లు ఒకే సారి వస్తాయేమో చూడాలి.