Begin typing your search above and press return to search.

యశోద.. అనుకున్నది ఒకటి అయినది ఒకటి..!

By:  Tupaki Desk   |   7 Nov 2022 3:30 AM GMT
యశోద.. అనుకున్నది ఒకటి అయినది ఒకటి..!
X
సమంత ప్రధాన పాత్రలో సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా యశోద. హరి హరీష్ దర్శక ద్వయం డైరెక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 11న రిలీజ్ చేస్తున్నారు. సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న కారణంగా ఆమె ప్రమోషన్స్ కి దూరంగా ఉంటున్నారు. సినిమాలో సమంత తర్వాత ఆమెకి ఈక్వల్ పాత్ర పోశించిన తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రమోషన్స్ చేయిస్తున్నారు. యశోద నిర్మాత కృష్ణ ప్రసాద్ కూడా సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.

హరి హరీష్ దర్శకులు ఇద్దరు తను చెన్నైలో ఉన్నప్పుడు ఈ కథ చెప్పారని.. కథ వినగానే చాలా ఆసక్తిగా అనిపించిందని అన్నారు. అంతేకాదు సినిమాని ముందు 3 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేద్దామని అనుకోగా సమంత ప్రాజెక్ట్ లోకి చేరాక దాదాపు 40 కోట్ల దాకా బడ్జెట్ అయ్యిందని అన్నారు. ఫీమేల్ సెంట్రిక్ సినిమాకు అంత బడ్జెట్ రిస్క్ ఏమో కదా అని అనుకున్నా సబ్జెక్ట్ మీద ఉన్న నమ్మకంతో అంత పెట్టేశాం అంటున్నారు కృష్ణ ప్రసాద్. సమంత వల్ల ఈ సినిమాకు చాలా హైప్ వచ్చిందని. ఆమె చాలా అద్భుతమైన నటి అని.. సినిమాకు ఆమె చాలా సపోర్ట్ అందించారని చెప్పారు.. అంతేకాదు ఆమె అందరికి స్పూర్తి కలిగించిందని అన్నారు నిర్మాత కృష్ణ ప్రసాద్.

మాములుగా తన ప్రతి సినిమాకు రిలీజ్ ముందు కొద్దిగా టెన్షన్ పడుతుంటాను కానీ ఈ సినిమాకు ఆ భయం అక్కర్లేదు. సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు నిర్మాత కృష్ణ ప్రసాద్. ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే హరి హరీష్ ఓ గొప్ప సినిమానే తీసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో సమంతతో పాటుగా ఆమెకి సపోర్ట్ గా మళయాళ స్టార్ దేవ్ మోహన్ నటించారు. అతను కూడా సినిమాకు చాలా హెల్ప్ అయ్యాడని అన్నారు నిర్మాత కృష్ణ ప్రసాద్. నవంబర్ 11న రిలీజ్ అవుతున్న యశోద సినిమాపై దర్శక నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

సరోగసి నేపథ్యంతో తెరకెక్కిన యశోద టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఒక అంచనాలను ఏర్పడేలా చేసింది. ముఖ్యంగా సమంత యాక్షన్ సీన్స్ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉన్నాయి. సమంత ఇదివరకు చేసిన ఫీమేల్ సెంట్రిక్ సినిమాల తరహాలోనే ఈ యశోద కూడా సక్సెస్ సాధిస్తుందా లేదా అన్నది చూడాలి.