Begin typing your search above and press return to search.

'యశోద' బ్రేక్‌ ఈవెన్ బాక్సాఫీస్‌ ముచ్చట్లు!

By:  Tupaki Desk   |   14 Nov 2022 2:30 AM GMT
యశోద బ్రేక్‌ ఈవెన్ బాక్సాఫీస్‌ ముచ్చట్లు!
X
సమంత హీరోయిన్‌ గా వరలక్ష్మి శరత్‌ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ ఎత్తున వసూళ్లు నమోదు చేస్తుందని యశోద మేకర్స్ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా యశోద సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశాం కనుక వంద కోట్ల వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

యశోద సినిమా పూర్తిగా సమంత యొక్క స్టార్‌ డమ్‌ పై ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత మయో సైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కారణంగా ప్రమోషన్ కార్యక్రమాలకు యాక్టివ్‌ గా హాజరు అవ్వలేక పోయింది. అయినా కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి సినిమా కోసం తన వంతు అన్నట్లుగా విడుదల ముందు మీడియా ముందుకు వచ్చింది.

హీరోయిన్ గా సమంత గతంలో ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే యశోద తనకు చాలా విభిన్నమైన సినిమా అని... సమాజంలో జరుగుతున్న అత్యంత దారుణమైన సంఘటనలు చూస్తూ ఉంటే ఆందోళనగా ఉందంటూ సమంత ప్రమోషన్ సందర్భంగా చెప్పింది. సినిమా పై అంచనాలు పెరిగే విధంగా యూనిట్‌ సభ్యుల వ్యాఖ్యలతో పాటు.. ట్రైలర్‌ టీజర్ ఉన్నాయి.

సినిమా విడుదల అయిన తర్వాత సమంత ఫ్యాన్స్ స్వయంగా పెదవి విరిచారు. కొందరు మాత్రం బాగుంది అంటూ కామెంట్స్ చేశారు. మొత్తానికి మిశ్రమ స్పందన వచ్చిన యశోద సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ను రీచ్ అవుతుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా ప్రస్తుతానికి డల్ గానే ఉందనే వార్తలు వస్తున్నాయి.

మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా సాధించిన వసూళ్లకు.. బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ కు చాలా గ్యాప్ ఉందట. ఇక ముందట ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ సాధిస్తుందా అంటే అనుమానమే అన్న మాట చాలా మంది నోట వినిపిస్తుంది. అంతే కాకుండా బ్రేక్ ఈవెన్‌ వద్దకు కూడా ఈ సినిమా కలెక్షన్స్ వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.

యశోద సినిమా డిజాస్టరా.. ఫ్లాపా.. హిట్టా అనే విషయం క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజుల్లో నమోదు అవ్వబోతున్న కలెక్షన్స్ ను చూసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సినిమా హిట్‌ అనేది సాధ్యం కాకపోవచ్చు అనేది చాలా మంది మాటా.. కనుక రాబోతున్న కలెక్షన్స్ ను బట్టి సినిమా డిజాస్టర్ గా నిలువబోతుందా లేదంటే ఫ్లాప్ గా నిలుస్తుందా అనేది చూడాలి.