Begin typing your search above and press return to search.
సమంత వ్యాఖ్యలు దుమారం తప్పదేమో!
By: Tupaki Desk | 7 May 2022 1:30 PM GMTసమంత-చైతన్య విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి జీవితం వారిది. ఎవరి స్వేచ్ఛ వారికుంది. ఎవరి బిజీలో వాళ్లు ఉన్నారు. విడాకుల సమయంలో సమంత ఇన్ స్టా పోస్ట్ లు కొన్ని నెట్టింట దుమారం రేపిన సంగతి తెలిసిందే. మనసులో మనో వేదనని వ్యక్త పరుచుకునే క్రమంలో నెటి జనులకు టార్గెట్ అయింది. తప్పంతా తనదే శైలిలో దూషణలకు దిగారు.
చైతన్య అమాయకుడు అంటూ..సమంతని కార్నర్ చేసారు ఓ సెక్షన్ నెటి జన్స్. అయితే వీటిపై ఏనాడు చైతన్య గానీ..సమంత గానీ స్పందించలేదు. తమ గురించే మాట్లాడినా నలుగురిలో ఎందుకని మౌనం దాల్చారు. ఇదంతా గతమే. వర్తమానానికి వస్తే సమంత నటిగా మరింత బిజ అయింది. విడాకుల తర్వాత కొత్త కమిట్ మెంట్ల జోరు పెంచింది. 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' ఐటం పాటలో ఎలా ఆడిపాడిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటతో పాన్ ఇండియాలోనే ఫేమస్ అయిపోయింది.
తాజాగా సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ''చాలా ప్రాజెక్ట్‌లలో పనిచేసిన తర్వాత నేను ఎక్కువ నమ్మకంగా ఉన్నానని చెప్పగలను. ఇది వయస్సు పరిపక్వతతో మాత్రమే వస్తుంది. నేను నా సొంత ఛరిష్మాతో సుఖంగా ఉండటానికి కొంత సమయం పట్టింది.
ఇప్పుడు నేను సెక్సీ సాంగ్ అయినా లేదా హార్డ్ కోర్ యాక్షన్ అయినా విభిన్నమైన పాత్రలను ప్రయత్నించడంలో చాలా నమ్మకంగా ఉన్నాను. ఇలాంటివి బహుశా గతంలో అయితే చేసి ఉండేదాన్ని కాదేమో. అప్పుడంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే ఉండేదాన్ని కాదేమో' అంది.
సమంత ఇలా వ్యాఖ్యానించడం వెనుక అసలు అర్ధం వేరేది ఉందంటూ నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు. సమంత తాజా వ్యాఖ్యల వెనుక గతం దాగి ఉందంటున్నారు. ఒకరికి భార్యగా ఉన్నంత కాలం ప్రతీ విషయంలో సోంత నిర్ణయాలకు ఆస్కారం ఉండదు. ఎక్కడో ఒక చోట అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి. కొన్ని కొన్ని విషయాలకు తప్పక కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలి.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే 'శాకుంతలం'..'యశోద'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్నవే. వాటిపై అంచనాలు బాగానే ఉన్నాయి. అలాగే బాలీవుడ్ లో నూ అవకాశాలు వస్తున్నాయి.