Begin typing your search above and press return to search.

సమీరా.. ఇలా అయితే కష్టమేరా!!

By:  Tupaki Desk   |   30 Aug 2016 3:30 PM GMT
సమీరా.. ఇలా అయితే కష్టమేరా!!
X
అన్ని సినిమా ఇండస్ట్రీలలోనూ సీనియర్ తారలు.. స్టార్లకు వారసులు ఎంట్రీ ఇచ్చేస్తుంటారు. కానీ బాలీవుడ్ లో ఈ జోరు బాగా ఎక్కువ. మిగతా పరిశ్రమల్లో కేవలం హీరోలు మాత్రమే వారసత్వం అందుకోవడం.. బాలీవుడ్ లో మాత్రం హీరోయిన్ నుంచి ఐటెం భామల వరకు అన్ని రకాల కేరక్టర్లు చేసేందుకు వారసులు సిద్ధపడ్డమే ఇందుకు కారణం అని ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు రాబోయే తరం హీరోయిన్లపై బాలీవుడ్ జనాలు బాగానే కన్నేశారు.

శ్రీదేవి కూతుళ్లు.. అమితాబ్ మనవరాలు.. సునీల్ శెట్టి కూతురు.. పూజా బేడి డాటర్.. సైఫ్‌ ఆలీ ఖాన్ పుత్రిక.. ఇలా ప్రతీ బ్యూటీని టీనేజ్ లోకి వచ్చినప్పటి నుంచి బాలీవుడ్ ఫాలో అయిపోతోంది. ఈ లిస్ట్ లో ఇప్పుడు మరో సుందరాంగి కూడా చేరిపోయింది. నటుడు దీపక్ తిజోరి కూతురు సమీరా చౌదరి ఇప్పుడు నెట్ లో సెలబ్రిటీ అయిపోయింది. హీరోయిన్ కి ఉండాల్సిన ఫిజిక్ కి సంబంధించి.. ప్రతీ కొలత ఈ భామ దగ్గర ఉన్నాయి. అంతే కాదు.. వాటిని పబ్లిక్ గా చూపించేందుకు వెనకాడని అలవాటు కూడా అదనపు అడ్వాంటేజ్. ఇంకా యాక్టింగ్ లోకి దిగకముందే సమీరా ఎక్స్ పోజింగ్ లెవెల్స్ చూసి.. చాలామంది తట్టుకోవడానికి కష్టపడిపోతున్నారని టాక్.

ఇప్పటికే ఈమె కాబోయే హీరోయిన్ అనే ప్రచారం గట్టిగానే ఉండగా.. గత నెలలో రిలీజ్ అయిన రుస్తొంకు టెక్నికల్ టీమ్ లో కూడా పనిచేసింది. ఇదంతం హీరోయిన్ గా మారేందుకు ప్రిపరేషన్ అనే టాక్ వినిపిస్తున్నా.. అమ్మడికి డైరెక్షన్ పై మనసుందట. ఏదో ఒక రోజున అటు వైపు కూడా సమీరా తిజోరి సత్తా చాటుతుందని సన్నిహితులు కాన్ఫిడెంట్ గా చెప్పేస్తూ ఉంటారు కానీ.. ఇప్పటికైతే హీరోయిన్ ఆఫర్ కోసం సమీరా వెయింటింగ్ చేసేస్తోంది. ఈ ఎదురచూపులకు చెక్ పెట్టే ఆ హీరో ఎవరో మరి!