Begin typing your search above and press return to search.
బాహుబలితో మొదలెట్టి ఇంద్ర చూపించాడు
By: Tupaki Desk | 14 April 2017 4:35 AM GMTఓ సినమాని ప్రచారం చేసుకోవడానికి చాలా తెలివితేటలు కావాలి. దాన్ని థియేటర్లలోకి తెచ్చేందుకు ఇంకా ఇంటెలిజెన్స్ కావాలి. అలాంటిది సినిమాని విడుదల చేసుకోలేక దాన్ని కూడా గొప్పగా పబ్లిసిటీ చేసుకోవడం అంటే.. వాళ్లవి కచ్చితంగా అతి తెలివితేటలు అనాల్సిందే.
సంపూర్ణేష్ బాబు సినిమాల్లో ఇలాంటి అతి బోలెడు కనిపిస్తుంది. మేకర్స్ కూడా ఇలా అతిగానే ఆలోచిస్తూ ఉంటారు. తీస్తూ ఉంటారు. 11 నెలల క్రితం ఓ లెంగ్తీ డైలాగ్ తో టీజర్ ఇచ్చి.. మధ్యమధ్యలో పోస్టర్లలో తప్ప ఎక్కడా కనిపించని కొబ్బరిమట్టకు.. ఇప్పుడు ఓ సాంగ్ టీజర్ ఇచ్చారు. బాహుబలి తర్వాత అత్యంత ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న చిత్రం అంటూ మొదట్లోనే జనాలకు ఓ బిస్కెట్ వేసేశారు. ఆ తర్వాత రాయలసీమ నీటి కరువును తీర్చేందుకు రాయుడు వస్తున్నాడంటూ.. శంభో శివ శంభో అంటూ ఓ లిరిక్ పెట్టేశారు. ఇప్పుడు రిలీజ్ అయింది ఆ సాంగ్ ప్రోమోనే.
ఇంద్ర సినిమాలో 'ఘల్లు ఘల్లుమని' అంటూ చిరంజీవి పాట స్టైల్ ను.. స్టెప్స్ ను స్పూఫ్ లుగా మార్చేసి.. సంపూర్ణేష్ బాబు కుప్పిగంతులతో నింపేసి.. ఇదే సాంగ్ టీజర్ అంటున్నాడు దర్శకుడు రూపక్. ఇలాంటి స్ఫూఫ్ లతో సినిమాలను టాలీవుడ్ జనాలు ఇంకా ఎన్నాళ్లు భరిస్తారని అనుకుంటున్నారో కానీ.. బాహుబలితో మొదలుపెట్టి ఇంద్రతో మిక్స్ చేసిన ఈ సాంగ్.. జనాలను యూట్యూబ్ వరకూ బాగానే నవ్విస్తోంది. థియేటర్లలో ఎలాంటి రిజల్ట్ వస్తందనేదే అసలైన పాయింట్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/