Begin typing your search above and press return to search.
ఒకే ఫార్ములా.. ఈ లాజిక్‌లు ఎలా మిస్సయ్యారబ్బా?
By: Tupaki Desk | 31 Aug 2022 12:30 AM GMTఒకే ఫార్ములాతో ఈ మధ్య వస్తున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి. ఇంతకు ముందు తెరపైకి వచ్చిన కథలనే అటు ఇటుగా మార్చి మళ్లీ రూపొందిస్తుండటంతో ప్రేక్షకులు నిర్ధ్వంద్వంగా తిరస్కరిస్తున్నారు. భారీ డిజాస్టర్లుగా మారుస్తున్నారు. ఈ మధ్య విడుదలైన రెండు సినిమాల పరిస్థితి ఇలాగే వుంది. వివరాల్లోకి వెళితే... నాగచైతన్య హీరోగా నటించిన రొమాంటిక్ డ్రామా `థాంక్యూ`.
`మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. ఓ యువకుడి యవ్వన దశ నుంచి వివిధ దశల్లో సాగే రొమాంటిక్ జర్నీ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. రాశీఖన్నా, మళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్ లుగా నటించారు. ఇదే తరహా లైన్ తో రూపొందిన మూవీ `ప్రేమమ్`. నాగచైతన్య నే హీరో. చందూ మొండేటి డైరెక్ట్ చేశారు. వివిధ దశల్లో సాగే ఓ యువకుడి ప్రేమ ప్రయాణమే ఈ మూవీ.
ఒకే హీరో రెండు సినిమాలు..అయితే `ప్రేమమ్` సూపర్ హిట్ గా నిలిస్తే `థాంక్యూ` ఏ స్థాయిలో డిజాస్టర్ అనిపించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిన్న లాజిక్ ని దర్శకుడు, హీరో, నిర్మాత ఎలా మిస్సయ్యారన్నది సగటు ప్రేక్షకుడికి అర్థం కావడం లేదు. ఒకే ఫార్ములాతో రెండు సినిమాలు ఎలా చేశారన్నది ఇప్పడు అర్థం కాని ప్రశ్న. ఇక ఇదే తరహాలో తాజాగా గతంలో వచ్చిన ఫార్ములాతో మరో మూవీ థియేటర్లలోకి వచ్చింది.
అదే విజయ్ దేవరకొండ `లైగర్`. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశకు గురిచేసింది. తండ్రి ఆశయం కోసం రింగులోకి దిగాలన్నది తల్లి ఆలోచన. అదే ఆలోచనతో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అయిన ఎంఎంఏ కోసం రింగులోకి హీరో దిగడం అనే కాన్సెప్ట్ తో `లైగర్`ని రూపొందించారు. గతంలో ఇదే తరహా కాన్సెప్ట్ తో ఎంటర్ టైన్ మెంట్ ని జోడించి చేసిన సినిమాలు పవన్ కల్యాణ్ `తమ్ముడు`, రవితేజ `అమ్మానాన్న ఓ తమిళమ్మాయి`.
`తమ్ముడు`లో తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం పవన్ రింగులోకి ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. `అమ్మానాన్న ఓ తమిళమ్మాయి`లోనూ తల్లి కల కోసం, తండ్రిని మెప్పించడం కోసం హీరో రవితేజ బాక్సర్ గా మారడం తెలిసిందే. ఈ రెండింటిలో `అమ్మానాన్న ఓ తమిళమ్మాయి` పూరి చేసిందే. ముందు రెండు సినిమాలు పెట్టుకుని పూరి, విక్రమ్ కె. కుమార్ ఈ లాజిక్‌లు ఎలా మిస్సయ్యారబ్బా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.