Begin typing your search above and press return to search.

పుష్ప గురించి మళ్లీ అవే పుకార్లు

By:  Tupaki Desk   |   9 July 2021 2:30 AM GMT
పుష్ప గురించి మళ్లీ అవే పుకార్లు
X
అల్లు అర్జున్‌.. సుకుమార్ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న పుష్ప సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ను అత్యంత భారీ బడ్జెట్‌ తో రెండు పార్ట్‌ లుగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. పుష్ప మొదటి పార్ట్ ను ఈ ఏడాదిలోనే విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్‌ ను పునః ప్రారంభించిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఏకధాటిగా షూటింగ్ ను నిర్వహించి సెప్టెంబర్‌ వరకు షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఇక సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక పుకారు మళ్లీ మళ్లీ వస్తోంది.

పుష్ప రెండు పార్ట్‌ లు గా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే మొదటి పార్ట్‌ పూర్తి అయిన వెంటనే రెండవ పార్ట్‌ చేయాలని దర్శకుడు సుకుమార్‌ మరియు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అనుకుంటూ ఉన్నారట. కాని బన్నీ మాత్రం పుష్ప మొదటి పార్ట్‌ విడుదల అయిన తర్వాత రెండవ పార్ట్‌ ను చేసేందుకు గాను తనకు ఆరు నెలల సమయం కావాల్సిందే అంటూ పట్టుబడుతున్నాడట. ఆ ఆరు నెలల సమయంలో ఐకాన్‌ ను పూర్తి చేసేలా బన్నీ ప్లాన్‌ చేసుకుంటూ ఉన్నాడట. ఈ విషయం దర్శక నిర్మాతలకు కాస్త మింగుడు పడటం లేదు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కాని ఈ విషయంలో నిజం లేదని.. సుకుమార్‌ స్వయంగా ఈ సినిమా రెండు పార్ట్‌ ల మద్య కాస్త గ్యాప్‌ ను ఉంచుదామని అన్నారని.. అందుకే బన్నీ తదుపరి సినిమా గా ఐకాన్‌ ను చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ బన్నీకి సన్నిహితంగా ఉండే వారు ఆఫ్‌ ది రికార్డ్‌ అంటున్నారు. అసలు ఈ రెండు పార్ట్‌ ల మద్య గ్యాప్‌ విషయంలో ఎలాంటి వివాదం లేదు అనేది వారి వాదన. ఈ విషయంలో మీడియాలో మళ్లీ మళ్లీ ఎందుకు పుకార్లు షికార్లు చేస్తున్నాయంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అభిమానులు మాత్రం ఈ విషయమై బన్నీ నుండి లేదా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి ఈ విషయమై క్లారిటీ కోరుకుంటున్నారు.