Begin typing your search above and press return to search.

#OTT వార్: ఆ యాప్ లో అదే కొర‌త‌!

By:  Tupaki Desk   |   28 March 2020 1:30 AM GMT
#OTT వార్: ఆ యాప్ లో అదే కొర‌త‌!
X
డిజిట‌ల్ వార్ లో పై చేయి సాధించాలంటే అందుకు త‌గ్గ క్వాలిటీ కోసం ప్ర‌య‌త్నం అవ‌స‌రం. కానీ ఆ యాప్ విష‌యంలో అస‌లు అదే కొర‌వ‌డింద‌నేది విమ‌ర్శ‌కుల విశ్లేష‌ణ‌. ఇక్క‌డ వెబ్ సిరీస్ లు ఏమంత ఆస‌క్తిక‌రంగా లేవ‌నేది తాజా విమ‌ర్శ‌. అయితే దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌క‌పోతే ఎలా?

నిరంత‌రం కంటెంట్ ప‌రంగా యంగేజ్ చేసే వెబ్ సిరీస్ లు చేస్తే స్టార్స్ తో చెయ్యాలి.. లేక‌పోతే స్టార్ రేంజ్ వాళ్ల‌తో చేయాలి. అదీ లేక‌పోతే క‌నీసం మినిమం గ్యారెంటీ న‌టుల‌తో చేయాలి. అలా చేస్తేనే వెబ్ సిరీస్ లకు ఒక గుర్తింపు వ‌స్తుంది. కోట్లు ఉన్నాయ్ క‌దా అని పెద్ద పెద్ద డైరెక్ట‌ర్స్ ని పెట్టి ఫేడవుట్ యాక్ట‌ర్స్ తో వెబ్ సిరీస్ తీయ‌డం వ‌ల్ల ఆహా యాప్ కి స‌రైన రెస్పాన్స్ రావ‌డం లేదు.

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మొత్తం వ్యూవ‌ర్ షిప్ ఇంపార్టెంట్. ఇక్క‌డ ఓటీటీలు మెజారిటీ యూత్ .. లేడీస్ ని టార్గెట్ చేసి న‌డుస్తున్నాయి..! వీళ్ల‌ని టార్గెట్ చెయ్యాలి అంటే ప్ర‌తి ఫ్రేమూ ఎగ్జ‌యిట్ చేయాలి. ప్ర‌తిదీ ఉత్కంఠ పెంచాలి. క‌నీసం ఆహా యాప్ కి సంబంధించిన ప్రోమోలు .. టీజ‌ర్.. ప్ర‌మోష‌న్స్ కూడా ఏమాత్రం ఎగ్జ‌యిటెడ్ గా లేవు.

పోటీ యాప్స్ అయిన అమెజాన్ .. నెట్ ఫ్లిక్స్ లాంటి వాటిలో వ‌చ్చే వెబ్ సిరీస్ లు టీజ‌ర్స్ ట్రైల‌ర్స్ చాలా ఈక్వాలిటీతో ఉన్నాయ్...! అల్లు బాస్ కి చెందిన‌ ఆహా యాప్ లో అదే కొర‌వ‌డింది! దీనికి తోడు నీరు కార్చేస్తున్న ప్ర‌మోష‌న్స్ వెర‌సి ఆహా యాప్ వ‌ల్ల ఇన్వెస్ట‌ర్స్ కి ఇప్ప‌టి వ‌ర‌కూ లాస్ త‌ప్ప లాభం లేదని ట్రేడ్ టాక్.