Begin typing your search above and press return to search.
విశ్వక్ సేన్.. మాస్ మహారాజా సేమ్ టు సేమా?
By: Tupaki Desk | 16 Dec 2022 9:30 AM GMTటాలీవుడ్ లో ఈ మధ్య ఒకే కథలు కొంచెం అటు ఇటుగా తెరపై కొస్తున్నాయి. కొన్ని ముందే రిలీజ్ కావడంతో వాటిని గమనించిన ఇతర మేకర్స్ తమ కథకు దగ్గరి పోలికలున్నాయని మధ్యలోనే తమ ప్రాజెక్ట్ లని నిలిపి వేస్తున్న సంఘటనలూ వున్నాయి. అలా కాకుండా తెలియకుండానే ఒకే కథలతో తెరపైకెక్కి పూర్తయి రిలీజ్ కి సిద్ధమవుతున్న సినిమాలు కూడా వుండటం విస్మయాన్ని కలిగిస్తోంది. ఒకే కథలతో తెరకెక్కిన రెండు సినిమాలు నెల రోజుల తేడాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ధమాకా'. త్రినాధరావు నక్కిన తెరకెక్కిస్తున్నాడు. 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 23న విడుదలకు రెడీ అవుతోంది. ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏక కాలంలో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది.
ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలు, టీజర్, ట్రైలర్ లు సినిమాపై అంచనాలని పెంచేశాయి. ఇదే తరహా కథతో మాస్ కా దాస్ విశ్వక్ సేన నటిస్తున్న 'దాస్ కి ధమ్కీ' రూపొందుతోంది. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి హీరో, స్క్రీన్ ప్లే, దర్శకుడు విశ్వక్ సేనే. ఈ మూవీకి కథని ప్రసన్నకుమార్ బెజవాడ అందించాడు. ఇక్కడే అసలు తిరకాసు కనిపిస్తోంది. ఈ చిత్ర కథ రవితేజ 'ధమాకా'కు దగ్గరగా కనిపిస్తోంది. 'దాస్ కి ధమ్కీ'కి కథ అందించిన ప్రసన్నకుమార్ బెజవాడ.. రవితేజ 'ధమాకా'కు కథ అందించడం గమనార్హం.
ఒకే కథని రెండు వెర్షన్ లు గా మార్చి ప్రసన్నకుమార్ బెజవాడ ఈ ఇద్దరు హీరోలకు హ్యాపీగా అమ్మేసినట్టుగా కనిపిస్తోంది. ఈ విషయం ట్రైలర్ లని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. రెండు సినిమాలలోనూ హీరో క్యారెక్టర్ డ్యుయెల్ రోల్.. ప్రతీ విషయంలోనూ రెండు సినిమాలకు దగ్గరి పోలికలు కనిపిస్తుండటంతో అంతా విస్తూ పోతున్నారు. ఒకే కథని అలా ఎలా అమ్మేశాడో అర్థం కావడంలేదని కొంత మంది ఆశ్చర్యపోతున్నారట.
రవితేజ నటించిన 'ధామాకా' ఈ డిసెంబర్ 23న రిలీజ్ కాబోతోంది. ఇక మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించి డైరెక్ట్ చేసిన 'దిస్ కా ధమ్కీ' ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది. నెల గ్యాప్ లో ఒకే తరహా కథలతో రూపొందిన సినిమాలు రిలీజ్ అవుతుండటంతో అందిరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరిలో ఏ సినిమా హిట్టవుతుంది.. ఏది ఫట్టవుతుందో తెలియాలంటే ముందు రవితేజ 'ధమాకా' రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.