Begin typing your search above and press return to search.
నటవారసుడికి పదే పదే అవే చిక్కులు ఏంటో..?
By: Tupaki Desk | 23 Feb 2022 6:48 AM GMTఆచితూచి అడుగులు వేయడం సరే కానీ.. సదరు నటవారసుడికి మాత్రం స్క్రిప్టు పరమైన చిక్కులు పదే పదే రిపీటవుతున్నాయి. గొప్ప దర్శకులు అతడిని కలిసి కథలు చెబుతున్నారు. ఆరంభం బావున్నట్టే అనిపిస్తోంది. కానీ సెట్స్ పైకి వెళ్లాక ఏదో ఒక అసంతృప్తి బయటపడుతోంది.
ఇలా అయితే హిట్టు కొట్టలేమన్న డౌట్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో హీరో ఇంట్లో పెద్దోళ్ల సలహాలు సూచనలు మొదలవుతున్నాయి. అటుపై దర్శకుడు అనుకున్న స్క్రిప్టు కాస్తా పూర్తిగా మారుతోంది. కథల్ని మార్చి రాస్తున్నారు. కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంతకుముందు కూడా ఆర్నెళ్లలో పూర్తి కావాల్సిన ఓ చిత్రాన్ని దర్శకుడు ఏడాదిన్నర టైమ్ తీస్కున్నాడు. సెట్స్ పైకి వెళ్లాక స్క్రిప్టులో లోపం బయటపడగా దానిని మార్పు చేర్పులు చేశారు. ఆ సినిమా ఏదోలా రిలీజై ఫర్వాలేదనిపించి బయటపడింది అనుకుంటే .. ఇప్పుడు భారీ గా అంచనాలు పెట్టుకున్న స్టార్ డైరెక్టర్ తోనూ ఇదే సమస్యలో ఇరుక్కున్నాడని టాక్ వినిపిస్తోంది. స్పై యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ స్క్రిప్టులో మార్పు చేర్పులను సూచించారని ఇప్పటికే కథనాలొచ్చాయి.
కొంత విదేశాల్లో చిత్రీకరణ పూర్తయ్యాక ఇంకా ఈ స్క్రిప్టులో ఉన్న లోపాలు బయటపడడంతో మళ్లీ దానిని మార్చే ఆలోచన చేస్తున్నారట. అసలే భారీ బడ్జెట్ పాన్ ఇండియా కాన్సెప్ట్ కావడంతో ఇలా పదే పదే మార్పు చేర్పులతో కలగాపులగం అవుతుందేమో! అన్న డౌట్ వ్యక్తమవుతోంది. ఒకవేళ దర్శకుడు లోకల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని కథను రాస్తే దానిని పాన్ ఇండియాకి మార్చాలనుకోవడం వల్ల ఇలా అయ్యిందా? అన్నది కూడా తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా కానీ సదరు నటవారసుడు ఎంత జాగ్రత్త తీసుకుంటే అంతా ఆలస్యమైపోతోంది. అయితే తన కెరీర్ లో ప్రతి అడుగు తనకు చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతిదీ తరచి తరచి ఆచితూచి అడుగులేస్తున్నాడు. నటించిన తొలి మూడు సినిమాల పరాభవం అతడిని రాటుదేలేలా చేసిందన్న టాక్ వినిపిస్తోంది.