Begin typing your search above and press return to search.

మీ..టూ అన్న మెగాస్టార్‌ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   7 May 2019 12:32 PM GMT
మీ..టూ అన్న మెగాస్టార్‌ హీరోయిన్‌
X
సౌత్‌ లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సమీరా రెడ్డి కొద్ది కాలంకే కనుమరుగయ్యింది. చిరంజీవి - ఎన్టీఆర్‌ వంటి స్టార్స్‌ తో నటించినా కూడా ఈమెకు బ్రేక్‌ రాలేదు. దాంతో ఈమె బాలీవుడ్‌ కు వెళ్లింది. బాలీవుడ్‌ - కోలీవుడ్‌ లో అడపా దడపా చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి అక్కడ కూడా అవకాశాలు అంతగా రాకపోవడంతో 2015లో పెళ్లి చేసుకుంది. అప్పటి నుండి కూడా సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం రెండవ సారి గర్బవతి అయిన సమీరా రెడ్డి గత కొన్ని రోజులుగా మీడియాలో సందడి చేస్తోంది. ఈమె చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. చాలా లావు అవ్వడం వల్ల నెటిజన్స్‌ ఇష్టం వచ్చినట్లుగా ట్రోల్‌ చేస్తున్నారని ఆ మద్య వాపోయిన సమీరా రెడ్డి తాజాగా మీ..టూ అంటూ వ్యాఖ్యలు చేసింది.

సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేదింపులు ఉన్నాయని, కొత్తగా వచ్చిన వారిని వాడుకునేందుకు ప్రయత్నిస్తారని, నటిగా గుర్తింపు దక్కించుకున్న తర్వాత కూడా వేదింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. తాను కెరీర్‌ ఆరంభంలో చాలా ఇబ్బందులు పడ్డాను. నటిగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించారు, కమిట్‌ మెంట్స్‌ కోసం నన్ను అడిగిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయంది.

మీటూ ఉద్యమం కారణంగా కొంతలో కొంతైనా మార్పు వస్తుందని తాను ఆశిస్తున్నాను అని, తప్పకుండా ముందు ముందు మరింతగా మార్పులు వచ్చి స్త్రీ పురుష బేధం లేకుండా ఉంటుందని తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. రెండవ సంతానంకు జన్మనిచ్చిన తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని, ఈమె బరువు తగ్గి ఆ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రీ ఎంట్రీ కోసమే సమీరా రెడ్డి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుందని కొందరు ముందు నుండే కామెంట్స్‌ చేస్తున్నారు.