Begin typing your search above and press return to search.
లావు అన్న మాటకు కడుపు నిండా పెట్టిందిగా!
By: Tupaki Desk | 12 March 2019 6:57 AM GMTగ్లామర్ ప్రపంచంలో ఉన్న వారు ఎప్పటికి నాజుకు బొమ్మల్లా ఉండాలనుకోవటం అత్యాశే. వాళ్లు మనుషులే.. వారికి జీవితాలు ఉంటాయి. మనకు మాదిరే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సినీ ప్రముఖులు.. సెలబ్రిటీలంతా మానవ మాత్రులే కానీ.. దేవతామూర్తులు కారు. మనలానే తింటారు.. మన మాదిరే ఆలోచిస్తారు. కాకుంటే.. కొన్ని అంశాలు వారికి ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి.
ఎంత అభిమానిస్తే మాత్రం.. అదే పనిగా విమర్శించే హక్కు ఎవరికి ఉండదు. కొన్ని సందర్భాల్లో అందరి మాదిరే సెలబ్రిటీలు సైతం మార్పులకు గురి అవుతుంటారు. అంత మాత్రానికే అనవసరమైన వ్యాఖ్యలు చేసి.. వారి మనసుల్ని గాయపరిచేలా మాట్లాడటం ధర్మం కాదు. కానీ.. అభిమానం ముసుగులో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించే తీరును కొందరు ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి వాటికి సున్నిత మనస్కులు విపరీతమైన వేదనకు గురవుతుంటారు. అదే సమయంలో మరికొందరు సెలబ్రిటీలు మాత్రం అందుకు భిన్నంగా ధైర్యంగా రియాక్ట్ అవుతుంటారు. బాలీవుడ్.. టాలీవుడ్... కోలీవుడ్ సహా పలు వుడ్డుల్లో నటించి కుర్రాకారు మనసుల్ని దోచేసిన సమీరారెడ్డి తాజాగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
సినీ నటిగా పలు సక్సెస్ చిత్రాల్లో నటించిన ఆమె పదిహేనేళ్ల క్రితం అక్షయ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కొడుకు. కాస్త గ్యాప్ తర్వాత ఆమె మరోసారి తల్లికానున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన కొందరు.. గతంలో సమీరా చాలా అందంగా ఉండేదని.. ఇప్పుడు కళా విహీనంగా తయారైందంటూ అవసరం లేని వ్యాఖ్యలు చేశారు. దీంతో.. సమీరా రియాక్ట్ అయ్యారు.
తనను తప్పు పడుతూ.. తన శరీరంలో వచ్చిన మార్పుల్ని తప్పు పడుతున్న వారిని ఉద్దేశించి ఘాటుగా మండిపడ్డారు. మళ్లీ నోరు విప్పటానికి భయపడేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. పెళ్లై.. పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొందరు కరీనాకపూర్ మాదిరి చాలా అందంగా మెరిసిపోతుంటారు. మరికొందరు సన్నపడటానికి కాస్త సమయం తీసుకుంటారు. నేను ఆ కోవకు చెందిన దానిని. అందరూ కరీనాలా ఉండాలని లేదు కదా?
అయినా.. మహిళల శరీరాకృతి గురించి కామెంట్లు చేయటం సిగ్గుచేటు అన్న ఆమె.. ఇలాంటి కామెంట్లు చేయటానికి సిగ్గు పడాలన్నారు. తనను విమర్శిస్తున్న వారిని తాను ఒక ప్రశ్నను అడగాలనుకుంటున్నట్లుగా చెప్పిన ఆమె.. మిమ్మల్ని కన్న తర్వాత కూడా మీ అమ్మ అందంగానే ఉందా? అంటూ దిమ్మ తిరిగేలా ప్రశ్నించారు. ప్రతి ఆడపిల్ల తన జీవితంలో అమ్మ అనిపించుకోవటానికి ఇష్టపడుతుందని.. పిల్లలు పుట్టిన తర్వాత మన శరీర ఆకృతి ఎలా ఉన్నా.. దాన్ని స్వీకరించటా ఎంతో అవసరమన్నారు.